90 డిగ్రీల కోణంలో బికినీ సెగలు

Thu Aug 09 2018 13:32:49 GMT+0530 (IST)

నెవ్వర్ బిఫోర్.. నెవ్వర్ ఎవ్వర్.. అని పొగిడేసే రేంజులో బికినీలో దర్శనమిస్తేనే ఇప్పుడు క్రేజు! మామూలుగా కనిపిస్తే పట్టించుకోరెవరూ. అనునిత్యం బికినీలతో చెలరేగే అమ్మణ్ణుల మధ్య ఏదో ఒక ప్రత్యేకత లేకపోతే మన బికినీ ఎవరు చూస్తారు.. అనుకుందో ఏమో.. ఇదిగో ఈవిడ 90 డిగ్రీల కోణంలో బికినీని చింపి ఆరేసింది. మొన్నటికి మొన్న మ్యాగ్జిమ్ కవర్ షూట్ కి సంబంధించిన ఫోటోషూట్ లీకైనా ఇంకా ఇంకా తరగని గనిలా తవ్వుకునే కొద్దీ బికినీలు బయటికి వచ్చి పడుతున్నాయ్. ముంబై బ్యూటీ నేహాశర్మ బికినీ వయ్యారాలు అలా అలా విజువల్ ట్రీట్ ఇస్తూనే ఉన్నాయి.ఈసారి అంతకుమించి! అన్న తీరుగా చెలరేగిపోయిందిలా. ఏదైనా బికినీని 180 డిగ్రీల కోణంలో చూపించడం వేరు. 90 డిగ్రీలకు అటూ ఇటూగా చూపించడం వేరు!  ఆ సంగతిని ఈ బికినీలో క్రియేటివిటీ ఇట్టే చెప్పేస్తోంది. ఈ షూట్ కోసం ఏకంగా కొండలు కోనల్లో - పచ్చందాల మధ్య గెస్ట్ హౌస్ కే వెళ్లిపోయినట్టు కనిపిస్తోంది. అసలే ఈ ఏడాదిలో నేహా మునుపటి కంటే బోల్డ్ గా - డెబ్యూ డేస్ కంటే హాట్ గా పునరాగమనం చేస్తోంది. `హేరా ఫేరి 3` చిత్రంలో అందచందాల వయ్యారాల వడ్డన చేయబోతోంది. పనిలో పనిగా ఇలా మ్యాగజైన్ కవర్ షూట్లతో చెలిరేగిపోతోంది.

ఇలా చెలరేగడం వల్లనే వచ్చే ఆ అవకాశాలు రానే వస్తున్నాయి. అయితే ఈ అమ్మడి వాలకం చూస్తుంటే అటు హిందీ సినిమాల్లోనే కాదు - ఇటు సౌత్ లోనూ తిరిగి రీఎంట్రీ ఇచ్చే ఛాన్సుందని అర్థమవుతోంది. ఇప్పటికే తమిళంలో ఓ సినిమాలో నటించేందుకు సంతకం చేసిందన్న సమాచారం ఉంది. మునుముందు టాలీవుడ్ లో మెగా కాంపౌండ్ పిలిచి అవకాశమిస్తుందేమో చూడాలి. నేహా తొలి వలపు సఖుడు `చిరుత`నయుడితో రీలాంచ్ అవుతుందో ఏంటో?