ఫోటో స్టొరీ: చూపులతో చంపుతున్న సుందరి!

Sun Jul 22 2018 17:35:05 GMT+0530 (IST)

సోషల్ మీడియాలో చాలామంది హాటు హాటు బ్యూటీలు ఉంటారన్న సంగతి తెలిసిందే.  కొంతమంది ఈ సుందరాంగులపై తమ అక్కసు వెళ్లగక్కుతుంటారు.. పొట్టి బట్టలు వేసుకుని పోజులిచ్చి ఆ ఫోటోలని అప్ లోడ్ చేసి వాళ్ళు చక్కగా నిద్రపోతారని.. కుర్రాళ్ళకు మాత్రం నిద్రలేకుండా చేస్తారని వీళ్ళపై చాలా కంప్లైంట్లు ఉన్నాయి.  ఊరికే తిన్నదరక్క చేసే విమర్శలే ఇవన్నీ.. ఎందుకంటే ఇలాంటి బ్యూటీలు కాకపోతే  బాన పొట్ట.. నోట్లు చుట్ట వుండే వాళ్ళు పొట్టి బట్టలు వేసుకొని ఆ అగ్లీ ఫోటోలు పెడతారా ఏంటి? అలా కొంతమందైనా పెడితే.. ఈ విమర్శలు చేసే వాళ్ళ తిక్క కుదురుతుంది!సరే.. చిరంజీవి తనయుడు చరణ్ డెబ్యూ సినిమా 'చిరుత' ను మీరు చూసే ఉంటారు కదా. అందులో హీరోయిన్ గా నటించి తన తలపొగరు తో హంగామా చేసిన నేహ శర్మ గుర్తుందా? గుర్తుంటే సరే.. లేకపోయినా ఒకే. ఎందుకంటే ఆ సుందరి ఇంకా అదే రకమైన అందాన్ని కొనసాగించడమే కాకుండా చూపులతో బాణాలు వేయడం ఆపలేదు. అప్పట్లో ఇన్ స్టాగ్రామ్ లేదు కదా.. అందుకే ఇప్పుడు దాన్లో తన తాజా చిత్రాలు అప్లోడ్ చేసి తన కసి మొత్తం తీర్చుకుంటోంది. ఏమాటకామాటే చెప్పుకోవాలి.. మన మాస్ మహారాజా రవితేజ చూడలేదేమో ఈ ఫోటో. ఒకవేళ చూసుంటే మళ్ళీ 'చూపులతో గుచ్చి గుచ్చి చంపకే.. ' అని ఓ పాటేసుకునేవాడు.  

అయన పాపం 'అమర్ అక్బర్ అంథోని' సినిమాతో బిజీగా ఉన్నాడేమో గానీ.. మీకిష్టమైన పాట మీరందుకోండి.. తప్పేమీ లేదు.  ఎందుకంటే.. ఈ ప్రపంచం చాలా అందమైనది. ఆ అందాన్ని చూడాలంటే కూసంత కలాపోసన ఉండాల్సిందే.  సోది ఎక్కువందంటే మన్నించండి.. అసలు ఇది సోదే కాదంటే క్షమించండి..కానీ అందాన్ని ఆస్వాదించండి.