అత్తకి నచ్చిన కొత్త గాళ్ ఫ్రెండ్

Wed May 16 2018 17:39:25 GMT+0530 (IST)

అలియాభట్... కరణ్ జోహార్ నిర్మించిన స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ చిత్రంతో తెరగ్రేటం చేసి... తక్కువ కాలంలో తనదైన స్టార్ గుర్తింపు తెచ్చుకున్న నాయక. అందంలోనే కాదు... అభినయంలోనూ మెప్పించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది అలియా. క్యూట్ లుక్స్ తో హాట్ అందాలను ప్రదర్శించే అలియా ఎవ్వరికైనా ఇట్టే నచ్చేస్తుంది. ఇప్పుడు ఆమెకు కాబోయే అత్త కూడా ఇలాగే అలియా మీద  తెగ ప్రేమ చూపిస్తోంది.మహేష్ భట్ గారాల కూతురు అలియా భట్... మాతృదినోత్సవం సందర్భంగా తన తల్లికి శుభాకాంక్షలు తెలుపుతూ... ‘హాలో బ్యూటిఫుల్ మమ్మీ... ఇట్స్ యువర్ డే. టుడే అండ్ ఎవ్రీ డే’ అంటూ షార్ట్ అండ్ స్వీట్ మెసేజ్ పెట్టింది అలియా. ఆ పోస్టుకి ముచ్చటపడిన రణ్ బీర్ కపూర్ తల్లి నీతూ కపూర్...‘ఆఆఆఆ...’ అంటూ కామెంట్ చేసి ప్రేమ గుర్తులు పోస్టు చేసింది. నీతూ కపూర్ కామెంట్‌కి రిప్లైగా మళ్లీ ముద్దు పెడుతున్నట్టుగా ఉన్న ఎమోజీలను పంపించింది అలియా భట్. అంతేకాదు అక్కడెక్కడో బల్గేరియాలో జరిగిన అలియా భట్ పుట్టినరోజు వేడుకలకి హాజరయ్యింది నీతూ. బర్త్ డే విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టు కూడా పెట్టింది.

బాలీవుడ్ ప్లేబాయ్ గా గుర్తింపు పొందిన రణ్ బీర్ కపూర్ - అలియా భట్ ల మధ్య ప్రేమాయణం నడుస్తోందని... త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే వాటిని కేవలం రూమర్స్ అని కొట్టిపారేసిన అలియా... బ్రహ్మాస్త్ర సినిమా కోసం కొన్ని రోజులు రణ్ బీర్ తో కలసి పనిచేసినంతలోగా అతనితో ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయిపోయానని చెప్పింది. చూడాలి... వీళ్లిద్దరి మధ్య ఉన్న రూమర్ ఏ మలుపు తిరుగుతుందో...