సాంగ్ టాక్: హార్ట్ టచ్చేసిన రైతు సాంగ్

Wed Jan 04 2017 19:24:48 GMT+0530 (IST)

''నీరు నీరు నీరు.. రైతు కంట నీరు.. చూడనైన చూడనెవ్వరు'' అంటూ వచ్చిన ఒక పాట అందరినీ కదిలించివేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాలోనిది ఈ పాట అంటే ఎవరైనా నమ్ముతారా? అదే కదా అసలు ట్విస్టు మరి. ఇప్పటివరకు కేవలం మాస్ బీట్ సాంగ్స్ తో షేకాడిస్తున్న ఈ ఖైదీ ఇప్పుడిలా సడన్ గా బాధను పంచే ఈ పాటను పాడుతున్నాడేంటి? పదండి చూద్దాం .

నిజానికి ''ఖైదీ నెం 150'' సినిమా అంతా కూడా ఒక ఊరికి చెందిన రైతుల నీటి సమస్య గురించి సాగే కథ. అయితే ఈ సినిమాలో కేవలం ఫ్లాష్ బ్యాక్ లో మాత్రమే ఆ ఎపిసోడ్ బాగా కనిపిస్తుంది. ఆ సమయంలో ఒక సాంగ్ కూడా ఉంటుంది. అదే ఈ నీరు నీరు సాంగ్. పాట వినగానే హృదయానికి హత్తుకునేలా ఉందంటే.. ఖచ్చితంగా శంకర్ మహదేవన్ వాయిస్ లోని మ్యాజిక్ అనే చెప్పాలి. గతంలో మనం చిరంజీవి సినిమాలు అంటే ఠాగూర్ లోని నేను సైతం వంటి ఎమోషనల్ హై ఉండే పాటలను చూశాం. ఎందుకంటే వాటిలో హీరోయిజం కూడా ఉంది కాబట్టి. కాని ఇప్పుడు మాత్రం కేవలం రైతుల ఆర్తనాదాన్నే చూపించే పాట కాబట్టి.. చాలా తక్కువ పిచ్ లో ఈ పాటను కంపోజ్ చేసి దేవిశ్రీ ప్రసాద్ అదరగొట్టేశాడు.

"గొంతు ఎండిపోయే.. పేగు మండిపోయే.. గంగ తల్లి జాడలేదని''.. ఈ ఒక్క లైన్ చాలు.. పాట రచయిత రామజోగయ్య శాస్ర్తి ఏ లెవెల్లో ఉద్వేగానికి గురై ఈ పాటను రాసుకున్నాడో అర్ధం చేసుకోవడానికి. ''గోంతు కోసుకుంది ఆకలి'' అంటూ రైతుల చావుల గురించి ఒక్క మాటలో ప్రస్తావించడం అనేది అద్భుతమైన సాహిత్య ప్రయోగం. అందుకు మనం రామాజోగయ్యను శభాష్ అనాల్సిందే.

ఈ హార్ట్ టచ్చింగ్ పాటను రైతులందరికీ అంకితం ఇచ్చింది ఖైదీ నెం 150 టీమ్!!Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/