Begin typing your search above and press return to search.

వీడియో సాంగ్: ప్యార్ వాలా మేజిక్

By:  Tupaki Desk   |   20 Nov 2018 8:40 AM GMT
వీడియో సాంగ్: ప్యార్ వాలా మేజిక్
X
వరస సక్సెస్ లతో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ టాక్సీవాలా బాక్స్ ఆఫీస్ వద్ద స్టడీగా దూసుకుపోతోంది. మొదటి రోజే బ్రేక్ ఈవెన్ చేరుకున్న మూవీగా బయ్యర్లను సేఫ్ చేసిన ఈ హారర్ రైడ్ డీసెంట్ రన్ ని కొనసాగించడం ఖాయమే. విజయ్ దేవరకొండ సాధారణంగా హీరోలకు ఉండే పరిమితులను దాటుకుని కొత్తగా ఉనికిని చాటుకునే ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నాడు. ఇప్పటికే సూపర్ ఓపెనర్ గా అవతరించిన విజయ్ తాజాగా చేసిన ఒక మ్యూజిక్ వీడియో సాంగ్ సినిమాకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో ఒక్క రోజులోనే ఐదు మిలియన్ వ్యూస్ కు దగ్గరగా వెళ్లి యుట్యూబ్ ట్రెండింగ్ లో ఏదో స్థానంలో నిలిచింది.

కూల్ మెలోడీతో నీ వెనకాలే నడిచి అంటూ హృద్యమైన పదాలతో గీత రచయిత అనంత శ్రీరామ్ చేసిన పదాల గారడికి సౌరభ్-దుర్గేష్ కంపోజిషన్ రిపీట్ మోడ్ లోకి వెళ్ళేలా చేస్తోంది. అందమైన జంట మధ్య కెమిస్ట్రీని దర్శకుడు భానుశ్రీ తేజ ఆవిష్కరించిన తీరు హృద్యంగా ఉంది. ఇక పాట విజువల్స్ విషయానికి వస్తే విజయ్ దేవరకొండ ఎప్పటిలాగే అమ్మాయిల మనసులు దోచేవాడిగా ప్రధాన ఆకర్షణ అయ్యాడు. ఫిమేల్ లీడ్ మలోబికా క్యుట్ లుక్స్ తో ఆకట్టుకునేలా ఉంది.

రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద షికారు చేయడం ఇద్దరు కలిసి స్నేహంతో మొదలుపెట్టి ప్రేమ దాకా ప్రయాణం చేయటం బీచ్ ఒడ్డున సముద్రపు అలల సాక్షిగా ప్రపంచాన్ని మర్చిపోయి ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోవడం స్వీట్ మేజిక్ లా ఉంది. సూర్య కెమెరా పనితనం అసెట్ గా నిలవగా చిన్మయి గొంతులో మాధుర్యం ఫీలింగ్ ని కరెక్ట్ గా ఎక్స్ ప్రెస్ చేసింది. టాక్సీ వాలాలో భయపెట్టె దెయ్యంతో ప్రయాణం చేసిన విజయ్ దేవరకొండ ఇప్పుడు ప్యార్ వాలాగా మారిపోయి ప్రేమను పంచుతున్నాడు.