ఫోటో స్టొరీ: రారా బ్యూటీ రచ్చ

Wed Dec 05 2018 10:23:44 GMT+0530 (IST)

నజియా డేవిసన్.. ఈ పేరు వినగానే మీరు కొత్త హీరోయిన్ లా ఉందే అని అనుకునే అవకాశం ఉంది.  కానీ ఈ ముంబై భామ తెలుగు తెరకు కొత్తేమీ కాదు.  శ్రీకాంత్ హీరోగా నటించిన హారర్ ఫిలిం 'రా రా' లో హీరోయిన్ గా నటించింది ఈ నజియా.  కాకపోతే ఆ సినిమాలో కాస్త చబ్బీగా ఉంది. ఇప్పుడు ఫుల్ గా ఎక్సర్ సైజులు.. డయటింగులు గట్రా చేసి ఇలా ఫిట్టుగా తయారైంది.ఇంతకీ ఈ ముంబై బ్యూటీ టాపిక్ ఇప్పుడెందుకంటే.. ఈ హాటీ ఇప్పుడు అక్కినేని అఖిల్ అప్కమింగ్ ఫిలిం 'Mr. మజ్ను'లో  సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోందనే విషయం తెలిసిందే కదా.  ఆమెతో పాటు  మోడరన్ మజ్నుకు ఈ హాట్ బ్యూటీ ని కూడా డైరెక్టర్ వెంకీ అట్లూరి జత చేశాడు.  ఫిలిం యూనిట్ మెంబర్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం అఖిల్-నజియా మధ్య వచ్చే రొమాన్స్ సీన్స్ అదిరిపోయాయట.  

మరి ఈ సినిమాతో నజియా టాలీవుడ్ ఫిలింమేకర్స్ దృష్టిలో పడడం మాత్రం ఖాయంగా ఉంది.  అసలే ఫిట్ గా స్లిమ్ గా తయారైంది కాబట్టి ఈమధ్య తన పిక్స్ తో ఇన్స్టాగ్రాములో మోత మోగిస్తోంది ఈ భామ. పైనున్న ఫోటో కూడా ఆ మోత లో భాగంగా అప్లోడ్ చేసిందే.