Begin typing your search above and press return to search.

నల్లనయ్యతో నయన్.. వాటే కాంబినేషన్!!

By:  Tupaki Desk   |   6 May 2016 7:28 AM GMT
నల్లనయ్యతో నయన్.. వాటే కాంబినేషన్!!
X
సినిమాలను ఒప్పుకోవడం ఒక్కో స్టార్ ది ఒక్కో రూట్ ఉంటుంది. హీరోయిన్స్ అయితే.. రెమ్యూనరేషన్ నుంచి హీరో, డైరెక్టర్, ఇమేజ్.. వీటి విషయాల్లో చాలా కరాఖండీగా ఉంటారు. తమ ఇమేజ్ కి ఫ్యూచర్ లో కూడా డామేజ్ జరగిని పాత్రలనే ఎంచుకుంటారు. కానీ మలయాళ కుట్టి నయనతార రూట్ సెపరేట్. స్టోరీ - తన రోల్ నచ్చి.. స్టార్ హీరో ఏంటి, అసలే హీరో లేకపోయినా నయనతార గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది.

రీసెంట్ గా వచ్చిన మాయ చిత్రం సెన్సేషన్స్ సృష్టించిన విషయం తెలిసిందే. ఆ మూవీలో ఆరి అనే కొత్త హీరోతో కూడా చేసేసింది నయన్. మాయను ఒంటి చేత్తోనే హ్యాండిల్ చేసేసి హిట్ కొట్టేసింది. ప్రస్తుతం నయన్ బాగా బిజీ. వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న నయనతార ఒప్పుకున్న ఓ తమిళ సినిమా ఇప్పుడు టాక్ ఆఫ్ ది కోలీవుడ్ అయింది. డైరెక్టర్ కం హీరో అయిన రాఘవ లారెన్స్ కి జంటగా నటించేందుకు నయన్ ఒప్పుకోవడం విశేషం. కాంచన సీక్వెల్స్ తీసుకుంటూ బ్లాక్ బస్టర్స్ కొడుతున్న లారెన్స్.. ఇప్పుడో మూవీ స్టార్ట్ చేయనున్నాడు.

ఇందులో లారెన్స్ డ్యుయల్ రోల్ చేయనుండగా.. ఓ పాత్రకి జంటగా నటించేందుకు నయనతార అంగీకరించడం విశేషం. ప్రస్తుతం కోలీవుడ్ - టాలీవుడ్ లలో టాప్ హీరోలతో సినిమా చేస్తున్న సమయంలోనే.. లారెన్స్ తో కూడా జత కట్టేందుకు అంగీకరించిన నయనతార ధైర్యాన్ని ఇండస్ట్రీ జనాలు తెగ పొగిడేస్తున్నారు.