నయన్ కూడా ఆ జాబితాలో చేరింది

Tue Feb 12 2019 16:30:56 GMT+0530 (IST)

సౌత్ లేడీ సూపర్ స్టార్ గా దూసుకు పోతున్న నయనతార ప్రస్తుతం వరుస చిత్రాలతో వచ్చేందుకు రెడీ అయ్యింది. సౌత్ లో అత్యధికంగా పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ గా నయనతార ఇప్పటికే పేరు దక్కించుకుంది. లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో పాటు - స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్న నయనతార తాజాగా శివ కార్తికేయన్ తో కలిసి 'మిస్టర్ లోకల్' చిత్రంలో నటించింది. 'ఓకే ఓకే' ఫేం రాజేష్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. తాజాగా మిస్టర్ లోకల్ చిత్రంకు సంబంధించి నయనతార షూటింగ్ పార్ట్ పూర్తి అయ్యింది.తన పార్ట్ షూటింగ్ పూర్తి అయిన సందర్బంగా యూనిట్ సభ్యులతో కలిసి కేక్ కట్ చేయడంతో పాటు - యూనిట్ సభ్యులకు సర్ ప్రైజింగ్ గిఫ్ట్ లను కూడా ఇచ్చింది. తన వ్యక్తిగత సహాయకులకు మరియు యూనిట్ సభ్యుల్లో చాలా మందికి ఫాసిల్ కంపెనీకి చెందిన వాచ్ లను నయన్ బహుమానంగా ఇచ్చినట్లుగా తమిళ సినీ వర్గాల వారి ద్వారా సమాచారం అందుతోంది. సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత నయనతార ఆ సినిమా గురించి పట్టించుకోదు అని అందుకే ప్రచారంకు కూడా రాదు అంటూ ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. కాని ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయిన తర్వాత మాత్రం నయనతార ఇలా యూనిట్ సభ్యులకు గిఫ్ట్ లు ఇచ్చి మరోసారి సూపర్ స్టార్ అనిపించుకుంది.

గతంలో సావిత్రి గారు షూటింగ్ పూర్తి అయిన తర్వాత గిఫ్ట్ లు ఇచ్చే వారట. ఈమద్య కాలంలో కీర్తి సురేష్ - విజయ్ ఇంకా కొద్ది మంది తమిళ స్టార్స్ గిఫ్ట్ లు ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా వారి జాబితాలో నయన్ చేరడం జరిగింది. ఈ ఆనవాయితీని నయన్ కొనసాగిస్తుందా లేదంటే ఈ ఒక్క సినిమాకే ఆపేస్తుందా చూడాలి. ప్రస్తుతం తెలుగులో ఈమె చిరంజీవి 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి' చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. తమిళ స్టార్ హీరో విజయ్ అట్లీల కాంబో మూవీలో కూడా ఈమె ఎంపిక అయినట్లుగా తెలుస్తోంది.