నయనతార దిగొచ్చిందా? దించారా?

Sun Aug 13 2017 22:55:56 GMT+0530 (IST)

సాధారణంగా సినిమాలను ప్రమోట్ చేయదు నయనతార. యాక్టింగ్ ఒక్కటే తన జాబ్ అని.. అది చేసేశాక ఇక ప్రమోషన్లు చేయడం ఏంటని హాలీవుడ్ నటుల రేంజులో కామెంట్లు చేస్తుంది. ప్రీమియర్లకు రాదు. మీడియా మైకుల ముందు మాట్లాడట. అప్పుడప్పుడూ ఏదన్నా సినిమా కోసం నాలుగు మాటలు చెబుతుంది అంతే. కాని ఇప్పుడు తన రూల్ ను బ్రేక్ చేసుకుంది.అవతల షారూఖ్ ఖాన్ వంటి పెద్ద పెద్ద స్టార్లే గల్లీ గల్లీకి తిరిగి తమ సినిమాలను ప్రమోట్ చేస్తున్నారు. అలాంటప్పుడు నయనతార ఏముంది చెప్పండి? మరి ఏం జరిగిందో తెలియదు ఉన్నట్లుండి ఇవాళ అమ్మడు సన్ టివి వారు వినాయక చవితినాడు టెలికాస్ట్ చేయడానికి తీస్తున్న ప్రోగ్రామ్ లో నయనతార పాల్గొంది. తన కొత్త సినిమా ఆరమ్ ను ప్రమోట్ చేసుకుంది. నయన్ మెయిన్ లీడ్లో.. ఆమె ఒక డస్ర్టిక్ట్ కలక్టర్ గా కనిపిస్తూ తీస్తున్న సోషియో పొలిటికల్ డ్రామా సినిమా ఆరమ్. ఈ సినిమాను ఇప్పుడు అమ్మడు గట్టిగానే ప్రమోట్ చేస్తోంది మరి. అసలు ఇలా టివిల్లోకి కూడా వచ్చేసి కొత్త కొత్త ప్రోగ్రాములు కూడా చేసేస్తోంది.

ఆల్రెడీ వయస్సు పెరుగుతోంది కాబట్టి ఇక స్టార్ హీరోయిన్ గా పెద్ద హీరోల సినిమాలు పట్టడం కష్టం. అందుకే నయన్ దిగొచ్చి ఇలా ప్రచారాల్లో ప్రమోషన్లలో పాల్గొంటే అమ్మడికి మరిన్ని సినిమాలు వస్తాయని ఆలోచించిందా? లేకపోతే ఇప్పటికైనా నువ్వొచ్చి సినిమాలను ప్రమోట్ చేయకపోతే కష్టం అంటూ నిర్మాతలు తెగేసి చెప్పేసి ఈమెను దించారా? ఏదేమైనా కూడా నయన్ ప్రమోష్ చేయడం కూడా ఒక వండరే.