Begin typing your search above and press return to search.

నాకు అందం ఉంది.. అదృష్టం ఉంది

By:  Tupaki Desk   |   25 July 2017 5:52 AM GMT
నాకు అందం ఉంది.. అదృష్టం ఉంది
X
సౌత్ లో ఒక హీరోయిన్ ని హీరోయిన్ గా కాకుండా సూపర్ స్టార్ గా చూసే ఒక హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క నయనతార అనే చెప్పక తప్పదు. సినిమా హీరోయిన్గా దాదాపు పదిహేను సంవత్సరాలుగా చేస్తున్నా.. ఇప్పటికీ సౌత్ సినిమాలో తానే టాప్ హీరోయిన్గా ఉంటుంది. తెలుగు - తమిళ్ - మలయాళం ఇలా అన్నీ ఇండస్ట్రిలలో కూడా మంచి క్రేజ్ సంపాదించింది నయనతార. ఇప్పుడు సౌత్లో ఒక సినిమా హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు నిర్మించాలి అంటే అందరి ఫిల్మ్ మేకర్స్ కు గుర్తుకు వచ్చేది ఈమె పేరు ఒక్కటే. ఈ మధ్య ఒక మీడియా ఇంటర్వ్యూ లో తన నట ప్రయాణం గురించి ఆమె అభిప్రాయాలూ కొన్ని ఇలా పంచుకుంది.

టాప్ హీరోయిన్ గా ఇన్ని ఏళ్ళు ఎలా ఉండగలిగారు ముఖ్యంగా సౌత్ సినిమాలో అది ఎలా సాధ్యపడింది అని అడిగిన ప్రశ్నకు నయనతార ఏమంటోందంటే.. “అందులో పెద్ద మర్మం ఏమి లేదు. అందరికి అందం ఉంది నాకు కొంచెం అదృష్ట శాతం ఎక్కువ ఉంది. అందుకే నన్ను ఇంకా ఇంతలా అభిమానిస్తున్నారు. నాకన్నా గొప్పగా నటించే వాళ్ళు చాలా మంది ఉన్నా నాకు పేరు వచ్చింది అంటే అది అదృష్టమే అని చెప్పాలి కదా” అనేసిందీ అమ్మడు.. ఇంకా ఇప్పుడు చేస్తున్న సినిమాలు గురించి ఆమె పారితోషకం గురించి చిన్న హీరోలుతో జత కట్టడానికి గల కారణాలు గురించి కూడా ఆమె తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. “నేను ఎక్కువ డిమాండ్ చేస్తాను అని అందరూ అంటారు కాని అది ఏమి వాస్తవం కాదు. మీరే అన్నారు కదా నేను టాప్ హీరోయిన్ని అనుభవం ఉన్న హీరోయిన్ని అని దానికి తగ్గట్లే తీసుకుంటాను కానీ ఎక్కువ తీసుకొను అని చెప్పింది. నేను ఎక్కువ ఇస్తే ఏ స్థాయి సినిమా అయినా ఒప్పేసుకుంటాను అనే మాటలు విన్నాను. నేను మొదటి సినిమా చేసినప్పుడు నాకు నటన కూడా అంతగా రాదు మరి అప్పుడు నాతో చేయడానికి సూపర్ స్టార్ రజినీకాంత్ ఒప్పుకోలేదా అంతటి స్టార్ కే ఎటువంటి పట్టింపు లేనప్పుడు నాకు ఎందుకు ఉంటుంది. వీళ్ళు చిన్న హీరోలు వీళ్లతో చేయకూడదు వాళ్ళు అలాంటి వారు వారితో చేయాలి అని ఏమి అనుకొను కథ నచ్చితే అందరితోను చేస్తా వాళ్ళు నటులే నేను నటినే'' అని చెప్పింది.

మరి ఇప్పుడు అన్నీ హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలే ఎందుకు చేస్తున్నారు అని అడిగితే నయనతార ఇచ్చిన సమాధానం చూడండి “ నాకు ఇన్ని ఏళ్లుగా గ్లామర్ పాత్రలు చేసి చేసి బోర్ కొట్టేసింది. ఇప్పుడు నా అదృష్టం కొద్ది నాకు ఇటువంటి పాత్రలు వస్తున్నాయి. పైగా అవి విజయవంతం కూడా అవుతున్నాయి. అందుకు చాలా సంతోషం'' అని చెప్పింది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడిగితే “ నాకు కూడా చేసుకోవాలి అనే ఉంది సినిమా ఇండస్ట్రి వాడైతే ఇంకా మంచిది చూద్దాం'' అని చెప్పింది నయన్. అది సంగతి.