Begin typing your search above and press return to search.

వెంకీకి తారలు చూపిస్తున్న నయన

By:  Tupaki Desk   |   9 Feb 2016 1:30 PM GMT
వెంకీకి తారలు చూపిస్తున్న నయన
X
వెంకటేష్ ఈ మధ్య సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. వరుస ఫ్లాప్స్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మల్టీ స్టారర్ మూవీ గోపాలా గోపాలా చేసినా.. ఆ తర్వాత సోలో హీరోగా సినిమా చేయాలనే నిర్ణయంతో.. చాలా టైం ఎదురుచూశాడు. దాదాపు 9 నెలల ఖాళీగా ఉన్నాక.. భలేభలే మగాడివోయ్ తో బ్లాక్ బస్టర్ సాధించిన మారుతీతో సినిమాకి సై అన్నాడు విక్టరీ వెంకటేష్.

బాబు బంగారం అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ మూవీని.. చాలా వేగంగా పూర్తి చేసేలా ప్లాన్ చేశాడు దర్శకుడు మారుతి. ఎంత ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలని ప్రణాళిక వేశారంటే.. జనవరి మధ్యలో మొదలైన మూవీ షూటింగ్ ని మార్చ్ నెలాఖరు కల్లా పూర్తి చేసేయాలని భావించారట. అందుకు తగ్గట్టుగానే పిక్చరైజేషన్ కూడా సాగింది ఇంత కాలం. కానీ ఇప్పుడు బ్రేక్ పడక తప్పనిసరి పరిస్థితి ఏర్పడిందట. దీనికి కారణం కోలీవుడ్ లో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ సాధించిన హీరోయిన్ నయనతార. బాబు బంగారం మూవీలో నయన్ నే హీరోయిన్ గా తీసుకున్నారు. ఇప్పటికే ఈమెతో తీయాల్సిన సన్నివేశాల షూటింగ్ స్టార్ట్ కావాల్సి ఉండగా.. ఇప్పటివరకూ కనీసం ఒక్కసారి కూడా రాలేదట నయనతార.

ఇఫ్పటికే ఈమె లేని సీన్స్ కు సంబంధించి మొత్తం తీసేయడం పూర్తయిపోయిందని కూడా తెలుస్తోంది. కోలీవుడ్ లో తెగ బిజీగా సినిమాలు చేస్తున్న నయన్.. ఇప్పుడు బాగా బిజీగా ఉంది. వెంకీ మూవీ కోసం ఈమె భారీగా రెమ్యూనరేషన్ కూడా పుచ్చుకుంది. ఇప్పుడిలా హ్యాండ్ ఇస్తుండడంతో.. షెడ్యూల్స్ లేట్ అవుతున్నాయట. సమ్మర్ కు రిలీజ్ చేయాలన్న ప్లాన్ కు దెబ్బ పడుతుందని మారుతీ, వెంకీ ఫీల్ అవుతున్నారని తెలుస్తోంది.