Begin typing your search above and press return to search.

`శ్రీమంతుడు`తో న‌య‌న‌తార!

By:  Tupaki Desk   |   29 July 2015 11:37 AM GMT
`శ్రీమంతుడు`తో న‌య‌న‌తార!
X
అస‌లు మ‌హేష్‌ కీ, న‌య‌న‌తార‌కీ సంబంధ‌మేమిటి? `శ‌్రీమంతుడు`లో హీరోయిన్ శ్రుతిహాస‌న్ క‌దా అంటారా? నిజ‌మే కానీ... ఇది వేరే మేట‌ర్లేండి. `శ్రీమంతుడు` ఆగ‌స్టు 7న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది క‌దా. ఆ సినిమాతో పాటు న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టించిన `మ‌యూరి` ట్రైల‌ర్ కూడా విడుద‌ల కాబోతోంది. `శ్రీమంతుడు` ఆడే థియేట‌ర్ల‌లో `మ‌యూరి` ట్రైల‌ర్‌ ని ప్ర‌ద‌ర్శించ‌బోతున్నారు. అద‌న్న‌మాట సంగ‌తి. న‌య‌న‌తార ప్ర‌ధాన పాత్ర‌లో అశ్విన్ శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌కుడిగా త‌మిళంలో `మాయ` అనే చిత్రం తెర‌కెక్కింది. అదే చిత్రం తెలుగులో `మ‌యూరి`గా విడుద‌ల కాబోతోంది. రెండు భాష‌ల్లోనూ సినిమాని తీశారు. ఇందులో న‌య‌న‌తార దెయ్యంగా క‌నిపించ‌బోతోంద‌ట‌.

న‌య‌న్‌కి త‌మిళంతోపాటు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే `మ‌యూరి`కి ఇక్క‌డ కూడా మంచి బిజినెస్ జ‌రుగుతోంది. క‌థానాయిక‌గా ఫుల్ రేసులో ఉన్న స‌మ‌యంలో ఆమె ఈ చిన్న సినిమాని ఒప్పుకొని చేయ‌డంతో ఇందులో ఏదో ఓ కొత్త విష‌యం ఉంద‌ని ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు న‌మ్ముతున్నాయి. అందుకే త‌మిళంలోనూ, తెలుగులోనూ సినిమాపై మంచి క్రేజ్ నెల‌కొంది. తెలుగు వ‌ర్ష‌న్‌ కి సి.క‌ళ్యాణ్ నిర్మాత‌. త్వ‌ర‌లోనే పాట‌ల్ని విడుద‌ల చేస్తారు. ఆగ‌స్టు రెండో వారంలో కానీ, మూడో వారంలో కానీ సినిమాని విడుద‌ల చేస్తారు. మ‌హేష్‌ బాబు సినిమాతో పాటు ట్రైల‌ర్ వ‌స్తోంది కాబ‌ట్టి `మ‌యూరి`కి మంచి ప‌బ్లిసిటీనే ద‌క్క‌బోతోంది. ఇలా క్రేజీ సినిమాల‌తో పాటు ట్రైల‌ర్ల‌ నీ, టీజ‌ర్ల‌ నీ విడుద‌ల చేస్తూ త‌మ సినిమాల‌కి మంచి ప్ర‌చారం చేసుకొంటున్నారు నిర్మాతలు. సి.క‌ళ్యాణ్ కూడా ప్ర‌మోష‌న్ ఈవెంట్స్‌ ని ప‌క‌డ్బందీ గా ప్లాన్ చేసి `మ‌యూరి` చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్నాడ‌ట‌.