Begin typing your search above and press return to search.

నయనతార కళ్ళ లో డెప్త్ కి కారణం

By:  Tupaki Desk   |   30 July 2015 1:35 PM GMT
నయనతార కళ్ళ లో డెప్త్ కి కారణం
X
దక్షిణాదిని హీరోయిన్ల లో టాప్ పొజిషన్ ఎవరిది అంటే.. నయనతార అని ఈజీగా చెప్పేయచ్చు. ఎఫైర్లు, ఫెయిల్యూర్స్‌ తోసంబంధం లేకుండా... అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ దూసుకుపోతోందీ పొడగరి. అటు సీనియర్ల ను, ఇటు యంగ్ జనరేషన్‌ తోనూ ఒకే సమయంలో చేసి మెప్పింగల సత్తా ఉంది నయన్‌ కి.

ఇంతటి ప్రతిభ ఉన్న నయనతారకు సూపర్ కాంప్లిమెంట్ దక్కింది. అది కూడా ఆమె నవ్వు, కళ్ల గురించి. నయన్‌ నవ్వును ఏకంగా మోనాలిసాతో పోల్చేశారు. మోనాలిసా నవ్వులో ఎంత లోతైన భావనకు కనిపిస్తాయో.. ఈతార కళ్లలోనూ అంత డెప్త్ ఉంటుందట. ఇంతగా ఆమెను ఆకాశనికి ఎత్తేసింది ఆమె మాజీ లవరే కావడం మరీ విశేషం.

ఈ పొగడ్తపై సుందరి నుంచి స్పందన కూడా వచ్చిందండోయ్. రోజంతా షూటింగ్ చేసి అలసిపోతుండడంతో తన కళ్లు లోతుకు వెళ్లిపోతాయని, అందుకే అంత డెప్త్ కనిపిస్తుందేమో అంటూ జోక్ చేసింది. నయన్‌ కి సెన్సాఫ్ హ్యూమర్ కూడా ఎక్కువే అనిపిస్తోంది కదూ. ఏ సందర్భాన్నై నా ఇట్టే హ్యాండిల్ చేయగలదు... కాబట్టే లవ్ ఫెయిల్యూర్స్‌ తో సంబంధం లేకుండా... నటీమణుల్లో అగ్రస్థానాన్ని కాపాడుకుంటోంది మరి. చిన్నదాని నయనాలు అంత అందంగా ఉండబట్టే కాబోలు... ఈ అమ్మడు నయనతార అయ్యింది.