నయన అందానికి దాసుడు కానిదెవరు?

Tue Oct 08 2019 09:49:53 GMT+0530 (IST)

సూపర్ స్టార్ మహేష్ .. తలైవి నయనతార.. మలయాళ స్టార్ దుల్కార్ సల్మాన్ .. ఇలా ది బెస్ట్ స్టార్లను ఎంపిక చేసుకుని వోగ్ మ్యాగజైన్ సరికొత్త ఫోటోషూట్లతో మోతెక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ ముగ్గురికి సంబంధించిన కొత్త ఫోటోషూట్ యూత్ లోకి వైరల్ గా దూసుకెళ్లిపోయింది. ముఖ్యంగా అందాల నయన తార కొత్త రూపం కుర్రకారును పరేషాన్ చేస్తోందంటే అతిశయోక్తి కాదు.తాజాగా వోగ్ కవర్ పేజీపై నయనతార లుక్ కి విశేష స్పందన దక్కుతోంది. ఇప్పటికే నయన్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ సిరీస్ లో మరికొన్ని లేటెస్ట్ ఫోటోలు సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తున్నాయి. వోగ్ కవర్ పేజీకే నయన్ అందం వన్నె తెచ్చింది అంటే అతిశయోక్తి కాదు.

కెరీర్ పరంగా చూస్తే.. సౌత్ లోనే క్రేజీయెస్ట్ స్టార్ గా నయన్ తన స్థానాన్ని రెండు దశాబ్ధాల పాటు ఎదురే లేకుండా కొనసాగిస్తోంది. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి సరసన సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటించింది నయన్. అమాయకత్వం కలబోసిన రాకుమారిగా నయన్ అద్భుత నటనతో మైమరిపించింది. చిన్నప్పుడే ధీరుడైన సైరాను పెళ్లాడి రెండు పుష్కరాల కాలం భర్తని చూడకుండా గడిపేసిన భార్యగా ఎమోషన్ ని తెరపై అద్బుతంగా ఆవిష్కరించారు నయన్. సైరాలో నయనతార పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రచారార్భాటంలో కనిపించకపోవడంతో క్రెడిట్ అంతా తమన్నా ఖాతాలోకి వెళ్లిపోయినా.. తలైవిగా అసాధారణ ప్రతిభావనిగా నయన్ కి ఉన్న గుర్తింపు చెడిందేమీ లేదు.