Begin typing your search above and press return to search.

అంత పెద్ద సైరా.. ఆమె కోసం బెండింగ్

By:  Tupaki Desk   |   15 Nov 2018 8:08 AM GMT
అంత పెద్ద సైరా.. ఆమె కోసం బెండింగ్
X
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న *సైరా నరసింహారెడ్డి’ స్కేల్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఏకంగా రూ.200 కోట్ల బడ్జెట్లో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అతి పెద్ద స్టార్లలో ఒకడైన అమితాబ్ బచ్చన్ ఇందులో కీలక పాత్ర చేస్తున్నాడు. కిచ్చా సుదీప.. విజయ్ సేతుపతి.. జగపతి బాబు లాంటి భారీ తారాగణం ఈ చిత్రంలో ఉంది. టెక్నీషియన్లు కూడా ఉద్ధండులు ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. దేశ విదేశాల్లో భారీ లొకేషన్లలో.. భారీ ఖర్చుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇలాంటి సినిమా విషయంలో కథానాయిక కొన్ని కండిషన్లు పెట్టి చిత్రీకరణకు హాజరైతే ఎలా ఉంటుంది? నయనతార అదే చేస్తున్నట్లు సమాచారం. చిరుకు సరైన జోడీ ఎవరా అని చూసి చూసి నయన్ ను ఈ చిత్రానికి ప్రధాన కథానాయికగా ఎంపిక చేశారు.

ఐతే తమిళంలో నయనకు తిరుగులేని డిమాండ్ ఉంది. అక్కడ ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో దూసుకెళ్తోంది. ఆమె హీరోయిన్లలో సూపర్ స్టార్ ఇమేజ్ సంపాదించింది. ఈ నేపథ్యంలో ‘సైరా’ చిత్రీకరణ కోసం డేట్లు అడిగితే.. ప్రస్తుతానికి మూడు రోజులు మాత్రమే కేటాయించిందట. షూటింగ్ కోసం ఆమె హైదరాబాద్ వచ్చినట్లు సమాచారం. ఈ మూడు రోజుల్లో నయన్ మీద మెజారిటీ సీన్లు తీసేయడానికి పక్కా ప్రణాళిక రచించుకుని సిద్ధంగా ఉందట చిత్ర బృందం. ఏ చిన్న ఇబ్బందీ రాకుండా షూటింగ్ చేయాలని.. మళ్లీ నయన్ డేట్లు దొరకడం కష్టమని సురేందర్ రెడ్డి బృందం భావిస్తోందట. ఏవైనా సన్నివేశాలు మిగిలితే.. మళ్లీ నయన్ కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది. సినిమాలో కథానాయిక పాత్రకు మరీ ప్రాధాన్యమేమీ ఉండదని అంటున్నారు. కాకపోతే చిరు పక్కన ఒక స్టేచర్ ఉన్న కథానాయిక ఉండాలని నయన్ ను ఎంచుకున్నారు. నయన్ షూటింగ్ కు రావడమే గొప్ప అనే పరిస్థితి ఉండగా.. ప్రమోషన్ల విషయంలో ఆమె నుంచి ఏమీ ఆశించడానికి లేదు. ఐతే ఇంత పెద్ద స్కేల్ ఉన్న సినిమా విషయంలో హీరోయిన్ కోసం ఇంత బెండ్ కావడమేంటి అన్న చర్చ నడుస్తోంది టాలీవుడ్లో.