టీజర్ టాక్: డోరా.. దటీజ్ నయనతార

Fri Feb 17 2017 23:17:36 GMT+0530 (IST)

తను చేసే ప్రతీ సినిమాతోనూ ఆకట్టుకునే ట్యాలెంట్ మలయాళీ బ్యూటీ నయనతార సొంతం. సౌత్ మొత్తానికి అగ్ర హీరోయిన్ అనిపించేసుకుంటున్న నయన్.. ఇప్పుడు డోరా అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీస్ ని సింగిల్ హ్యాండ్ డీల్ చేయడంలో బాగా ముదిరిపోయిన నయన్.. ఈ హారర్ మూవీతో మరోసారి ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా రిలీజ్ అయిన డోరా ట్రైలర్ ఆద్యంత ఉత్కంఠభరితంగా సాగి ఆకట్టుకుంటుంది.

టీజర్ ప్రారంభం నుంచే కారుతో మొదలుపెట్టగా.. నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో నయనతార తర్వాత కారుకే ఎక్కువే స్క్రీన్ ప్రెజన్స్ ఉంది. ఎక్కడా చిన్నపాటి క్లూ కూడా ఇవ్వకుండా భయపెట్టడంలో మాత్రం ట్యాలెంట్ చూపించాడు దర్శకుడు దాస్ రామస్వామి. కాసేపు మామూలుగాను.. ఒక్కోసారి భయం భయంగాను.. మరోసారి భయపెట్టేట్లుగాను నయనతార యాక్టింగ్ మాత్రం ఇరగదీసేసింది.

డోరా టీజర్ చివర్లో హీరోయిన్ నయన్ అలా నడుచుకుంటూ వస్తుంటే.. ఇచ్చిన బిల్డప్.. వినిపిస్తున్న మ్యూజిక్.. తను ధరించిన టాప్ పైకి మడతపెడుతూ నడక.. ఇవన్నీ చూస్తుంటే.. స్టార్ హీరో రేంజ్ కి ఏ మాత్రం తగ్గకుండా నయన్ ఈ మూవీలో రెచ్చిపోయిందనే విషయం అర్ధమవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే డోరా టీజర్ తో దటీజ్ నయన తార అనిపించేసింది. అన్నట్లు.. ఈ టీజర్ లో కారుకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉండడానికి కారణం.. అసలీ హారర్ మూవీలో దెయ్యం ఆ కారే అని ఓ టాక్.