32 ఏళ్ళ స్టార్ హీరోయిన్.. హ్యాపీ బర్త్ డే

Sat Nov 18 2017 12:49:59 GMT+0530 (IST)

సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ కొనసాగుతోన్న స్టార్ హీరోయిన్ నయనతార. మొదట మలయాళం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అతి తక్కువ రోజుల్లోనే సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ అయిపొయింది. అంతే కాకుండా కెరీర్ మొదటి నుంచి ఒక సినిమా ప్లాప్ అయితే వెంటనే రెండు హిట్టు కథలను ఎంపిక చేసుకునేది. తీవ్రంగా పోటీ నడుస్తోన్న ఈ రోజుల్లో కూడా ఏడాదికి నాలుగైదు సినిమాలను రిలీజ్ చేస్తోంది.  ఇక అసలు విషయానికి వస్తే ఈ రోజు నయన్ పుట్టిన రోజు. 32లోకి అడుగుపెట్టిన ఈ తార కెరీర్ లో స్టార్ డమ్ తో పాటు పలురకాల వివాదాల్లో కూడా టాప్ లో నిలిచింది. అలాగే ఆన్ స్ర్కీన్ తన గ్లామర్ తో యువతను ఊర్రూతలూగించింది. సడన్ గా గ్లామర్ నుండి యాక్టింగ్ ఓరియెంటెడ్ పాత్రలు చేస్తూ.. తనకు తానే కొత్త బాష్యం చెప్పుకుంది. బెస్ట్ యాక్టర్ గా తనను తాను చాలా సార్లు నిరూపించుకొని పలు అవార్డులను కూడా అందుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డును కూడా అందుకుంది. అంతే కాకుండా తమిళ ప్రభుత్వం ప్రకటించే కలైమామని పురస్కారాన్ని కూడా పొందింది.

ఇక రెండు ప్రభుత్వాల నుండి అవార్డులను అందుకున్న నయన ప్రస్తతం చాలా బిజీగా ఉంది. తెలుగులోల్ మెగాస్టార్ చారిత్రాత్మక చిత్రం సైరలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా తమిళ్ లో నాలుగు సినిమాల్లో నటిస్తోంది. అందులో ఒక సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది.  ఇకపోతే నయన్ తన పుట్టినరోజును బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ తో కలసి జరుపుకున్నట్లు.. అతను పోస్ట్ చేసిన ట్విట్టర్ పిక్ చూస్తే తెలుస్తోంది. అది సంగతి.