Begin typing your search above and press return to search.

సైరా సెట్స్ కి వచ్చేసిన సూపర్ స్టార్

By:  Tupaki Desk   |   20 March 2018 4:54 AM GMT
సైరా సెట్స్ కి వచ్చేసిన సూపర్ స్టార్
X
టాలీవుడ్ లో సెట్స్ పై ఉన్న మూవీస్ లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రం సైరా. బాహుబలి సిరీస్ మినహాయిస్తే.. మరే ఇతర టాప్ బ్లాక్ బస్టర్ ను తీసుకున్నా.. వాటి వసూళ్ల స్థాయికి రెట్టింపు మొత్తం బడ్జెట్ తో ఈ చిత్రాన్ని ప్లాన్ చేశారు. ఇందుకు తగ్గట్లుగానే తారాగణాన్ని కూడా ఎంపిక చేశారు. మెగాస్టార్ పక్కన ఓ హీరోయిన్ గా కీలక పాత్రలో నటించేందుకు నయనతారను సెలెక్ట్ చేశారు.

లేడీ సూపర్ స్టార్ అనిపించుకుంటున్న నయనతార.. సైరా షూటింగ్ ను స్టార్ట్ చేసేసింది. హైద్రాబాద్ లోని నానక్ రాం గూడలో వేసిన భారీ సెట్స్ లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతుండగా.. కొద్ది రోజులుగా నయనతార కూడా పాల్గొంటోంది. మెగాస్టార్ చిరంజీవి కూడా రెగ్యులర్ గా పలు సీన్స్ షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. చిరుతో పాటు జగపతి బాబు.. బ్రహ్మాజీ.. వంటి పాత్రధారులతో నయనతారకు సంబంధించిన సన్నివేశాలు ఉంటాయట. వీటినే ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. నయన్ ఎపిసోడ్ ను వీలైనంత వరకు కవర్ చేసేలా ఈ షెడ్యూల్ ఉంటుందట.

మరో వారం రోజుల్లో.. అంటే మార్చ్ 28 నుంచి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా సైరా నరసింహారెడ్డి షూటింగ్ లో పాల్గొనేందుకు రాబోతోన్నారు. ఈయనకు సంబంధించిన సన్నివేశాల షూటింగ్ కూడా ఇవే సెట్స్ లో ఉంటాయట. సైరా ఫిలింకు.. ప్రస్తుతం చిత్రీకరిస్తున్న ఎపిసోడ్ చాలా కీలకమైన సన్నివేశాలతో నిండి ఉందని అంటున్నారు.