Begin typing your search above and press return to search.

మళ్ళీ హారర్‌ అంటున్న నయన్‌

By:  Tupaki Desk   |   2 Dec 2015 6:03 AM GMT
మళ్ళీ హారర్‌ అంటున్న నయన్‌
X
పాతొక రోతో- కొత్తొక వింత‌!! పాత చింత‌కాయకే కొత్త టేస్ట్ జోడించి మ‌రీ అమ్మేస్తున్నారు. క‌త్తి కాంతారావు, న‌ర‌సింహారావు హీరోలుగా వెలుగుతున్న‌ కాలంలోనే జ‌గ‌న్మోహిని -లాంటి హార‌ర్ క‌మెడీ వ‌చ్చింది. ఈ మూవీలో దెయ్యం చేసే వింత చేష్ట‌ల్ని ఆరోజుల్లో ప్ర‌జ‌లంతా క‌థ‌లు క‌థ‌లు గా చెప్పుకున్నారు. అయితే ఆ ఫార్ములానే కాస్త అటూ ఇటూగా మార్చి నేటి ట్రెండ్‌తో సినిమాలు తీస్తూ స‌క్సెస్‌లు కొట్టేస్తున్నారు న‌వ‌త‌రం ద‌ర్శ‌కులు.

చంద్ర‌ముఖి నుంచి మొద‌లైన ట్రెండ్ కాస్తా ప్రేమ‌క‌థా చిత్రం, గీతాంజ‌లి, చంద్ర‌క‌ళ‌, మాయ సినిమాల‌తో పీక్స్‌కి వెళ్లిపోయింది. హార‌ర్‌లో కామెడీ అనే జోన‌ర్ ఇప్పుడు స‌క్సెస్‌ఫుల్ గా న‌డుస్తోంది. అందుకే ఇటీవ‌లే హార‌ర్ థ్రిల్ల‌ర్ `మాయ‌` చిత్రంతో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టేసిన న‌య‌న్ మ‌రోసారి సేమ్ జోన‌ర్ మూవీలో న‌టించేందుకు సంత‌కం చేసింది. క‌ళ‌వాణి ఫేం స‌ర్కున‌మ్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. అత‌డి శిష్యుడు దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. ఇటీవ‌లే స్ర్కిప్టు విన్న న‌య‌న‌తార స్పెల్ బౌండ్ అయిపోయిందిట‌. వెంట‌నే ఈ మూవీకి ఓకే చెప్పేసింద‌ని చెబుతున్నారు.

ప్ర‌స్తుతం న‌య‌న్ పూర్తిగా యూట‌ర్న్ తీసుకుని కెరీర్‌ని న‌డిపిస్తోంది. స్టార్ హీరోల‌తో పాటు యువ హీరోల్ని లైన్‌లో పెట్టేస్తోంది. యంగ్ హీరో జీవాతో తిరునాళ్ చిత్రంలో న‌టిస్తూనే రోజా పూలు ఫేం విక్ర‌మ్ స‌ర‌స‌న ఓ సినిమా చేస్తోంది. వీటితో పాటు హార‌ర్ థ్రిల్ల‌ర్‌కి సంత‌కం చేసింది. అదీ మ్యాట‌ర్‌!