ముందు సూపర్ స్టార్.. ఆ తర్వాతే తన సినిమా!

Fri Jan 11 2019 13:32:51 GMT+0530 (IST)

సౌత్ లో నయనతార టాప్ హీరోయిన్.. ఇందులో ఎటువంటి అనుమానాలకు తావు లేదు. రెమ్యూనరేషన్ కానివ్వండి.. క్రేజ్ కానివ్వండి.. నయన్ కు పోటీ ఇవ్వగలిగిన హీరోయిన్ మరొకరు సౌత్ లో ప్రస్తుతానికి లేరు.  ఇక పర్సనల్ లైఫ్ విషయం తీసుకున్నా నయన్ మిగతావారి కంటే ఒక మెట్టు పైనే ఉంటుంది.  లవ్ ఎఫైర్లన్నీ ఓపెన్ సీక్రెట్. తనంతట తానూ నోరు తెరిచి చెప్పదు.. అలా అని సీక్రెట్ గా కూడా ఉంచదు.  ప్రస్తుతం నయన్ అమెరికా ట్రిప్ లో బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ తో ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది.నయన్ కు ఎప్పుడు టైమ్ దొరికినా బాయ్ ఫ్రెండ్ తో కలిసి లాస్ ఏంజెలెస్ వెళ్ళిపోయి సరదాగా గడుపుతుందట. ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం విఘ్నేష్ తో కలిసి రెండు వారాలక్రితమే అమెరికా ఫ్లైట్ ఎక్కిందట. పొంగల్ సీజన్ హాలిడేస్ ఫుల్లుగా ఎంజాయ్ చేసి ఆ తర్వాతే చెన్నైకి తిరిగి వస్తుందట.  నిన్న అంటే జనవరి 10 వ తారీఖున నయన్ హీరోయిన్ గా నటించిన అజిత్ కుమార్ 'విశ్వాసం' రిలీజ్ అయింది.  ఎప్పటిలాగానే నయన్ ఆ సినిమా ప్రమోషన్స్ లో కూడా పాల్గొనలేదు.  ఇక సినిమా అయినా చూసిందా అంటే.. అక్కడే ఒక ట్విస్ట్ ఉంది.

'విశ్వాసం' రిలీజ్ అయిన రోజే సూపర్ స్టార్ 'పెట్టా' కూడా రిలీజ్ అయింది.  రెండిటిలో ఈ సెలబ్రిటీ జంట వోటు మాత్రం సూపర్ స్టార్ సినిమాకే వేయడం విశేషం. మొదట 'పెట్టా' ను చూసి ఆ తర్వాత 'విశ్వాసం' చూశారట.  ఈ రెండు సినిమాలను లాస్ ఎంజెలెస్ లోనే చూశారట. సొంత సినిమా కంటే ముందుగా రజనీ సినిమాను చూశారంటేనే మనకు వాళ్ళకు రజనీ పై అభిమానం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ లెక్కన 'విశ్వాసం' కంటే అభిమానం గొప్పదన్నమాట!