Begin typing your search above and press return to search.

బ్లాక్ అండ్ వైట్ నయన్ వెనుక కథ ఇదా

By:  Tupaki Desk   |   19 Feb 2019 4:50 AM GMT
బ్లాక్ అండ్ వైట్ నయన్ వెనుక కథ ఇదా
X
అదేంటి అందమైన అమ్మాయి సలక్షణకు మారుపేరుగా నిలిచే నయనతారను పట్టుకుని అంత మాటా అంటారా అభిమానులు ఫీలవ్వకండి. ఇక్కడ కాన్సెప్ట్ వేరే ఉంది. ఒకపక్క స్టార్ హీరోలతో ఛాన్సులు కొడుతూనే మరోపక్క హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ అంటే తాను తప్ప బెస్ట్ ఛాయస్ లేదు అనేలా ఫుల్ జోష్ లో ఉన్న నయన్ కొత్త సినిమా ఐరా మార్చ్ 28 రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. ఈ మేరకు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

ఇందులో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. నయనతార మొదటిసారి డ్యూయల్ రోల్ చేస్తోంది. అది ఒక హై లైట్ కాగా అందులో ఒక పాత్ర పూర్తి నల్లగా ఉంటుంది. ఎంతగా అంటే చీకట్లో నవ్వితే తప్ప పలువరసను బట్టి గుర్తుపట్టలేనంత. రెండో పాత్ర సాధారణంగా మనం రోజు చూసే నయన్ లాగే ఉంటుంది. ట్విస్ట్ ఏంటంటే నల్లగా ఉండే నయన్ ఓ గ్రామీణ ప్రాంతంలో అంతుచిక్కని రీతిలో హత్యకు గురై ఉంటుంది. తన ఆత్మనే ఇప్పుడు అందంగా ఉండే నయన్ ను ఆవహిస్తుంది. కట్ చేస్తే ఇద్దరూ అక్కాచెల్లెళ్లు అన్న విషయం తర్వాత తెలుస్తుంది.

అసలు వీళ్ళు ఇలా ఎందుకు విడిపోయారు ఒకరు నల్లగా ఒకరు తెల్లగా ఉండటానికి కారణం ఎవరు లాంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలి అంటే ఐరా చూడాల్సిందే. మరో ట్విస్ట్ ప్రకారం ఐరా జీవితం ఇలా కావడానికి ఆరుగురు అపరిచితులకు లింక్ ఉంటుంది. లైన్ బాగుంది కదూ. ఐరాను తెలుగులో కూడా డబ్ చేస్తున్నారు. ఇది నిర్మాతలు చెప్పింది కాదు కానీ అనధికార వర్గాల ద్వారా చెన్నై సర్కిల్స్ నుంచి లీక్ అయిన రిపోర్ట్. సర్జున్ దర్శకత్వం వహించిన ఐరా లో కలైఅరసన్ మేల్ లీడ్ గా నటిస్తున్నాడు. నెల క్రితమే టీజర్ హంగామా చేసింది. మరి నలుపు తెలుపు నయన్ లు ఏం చేసారో తెలియాలంటే ఇంకో నెలన్నర ఆగాల్సిందే.