Begin typing your search above and press return to search.

#మీటూ : అండర్‌ గ్రౌండ్‌ కు స్టార్‌ నటుడు

By:  Tupaki Desk   |   11 Nov 2018 12:18 PM GMT
#మీటూ : అండర్‌ గ్రౌండ్‌ కు స్టార్‌ నటుడు
X
బాలీవుడ్‌ లో మీటూ అంటూ పలువురు హీరోయిన్స్‌ మరియు పరిశ్రమకు చెందిన మహిళలు స్టార్‌ హీరోలు - దర్శకులు - నిర్మాతలు - నటులపై ఆరోపణలు చేస్తున్న విషయం తెల్సిందే. ఎంతో మంది ఈ ఆరోపణల కారణంగా అవకాశాలు కోల్పోవడంతో పాటు - నానా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు తమపై వచ్చిన ఆరోపణలను లీగల్‌ గా ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తుండగా మరి కొందరు మాత్రం ఎవరికి కనిపించకుండా వెళ్లి పోతున్నారు.

తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్దిఖీ పై మాజీ మిస్‌ ఇండియా నిహారిక సింగ్‌ సంచలన ఆరోపణలు చేసింది. ఆయనకు పెళ్లి అయిన విషయం చెప్పకుండా తనతో సంబంధం పెట్టుకున్నాడని - బలవంతంగా లొంగదీసుకున్నాడు అంటూ సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా అంతా షాక్‌ అయ్యారు. ఈ విషయమై నవాజుద్దీన్‌ రెస్పాన్స్‌ ను తీసుకునేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేకుండా పోయింది.

ప్రస్తుతం నవాజుద్దీన్‌ బాలీవుడ్‌ లో ఒక సినిమాను మాత్రమే చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్‌ కూడా పూర్తి చేసిన నవాజుద్దీన్‌ తన పార్ట్‌ కు డబ్బింగ్‌ చెప్పుకోలేను అని - డబ్బింగ్‌ వెరే ఆర్టిస్టుతో చెప్పించుకోవాలని - తాను ప్రమోషన్‌ కార్యక్రమాల్లో కూడా పాల్గొనలేక పోతున్నందుకు క్షమించాలి అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులకు తెలియజేశాడట. తాను ఎక్కడ ఉన్న విషయం కూడా ఆయన చెప్పలేదని వారు చెబుతున్నారు. కొన్నాళ్ల పాటు నవాజుద్దీన్‌ సిద్దిఖీ ఎవరికి కనిపించకుండా ఉండాలని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. మొత్తానికి మీటూ వల్ల ట్యాలెంటెడ్‌ యాక్టర్‌ ఇలా కనిపించకుండా - అండర్‌ గ్రౌండ్‌ లోకి వెళ్లి పోయాడు. ఇలా నవాజుద్దీన్‌ కనిపించకుండా వెళ్లి పోవడం వల్ల ఆయనపై వస్తున్న ఆరోపణలు నిజమేనేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.