Begin typing your search above and press return to search.

యాక్షన్ థ్రిల్లరే.. కానీ సెంటిమెంట్ కూడా

By:  Tupaki Desk   |   22 May 2018 12:18 PM GMT
యాక్షన్ థ్రిల్లరే.. కానీ సెంటిమెంట్ కూడా
X
తండ్రి-కూతురు సెంటిమెంట్ తో వచ్చిన తెలుగు సినిమాలు మనం బాగానే చూశాం. కానీ నాగార్జున హీరోగా కూతురి సెంటిమెంట్ తో సినిమాలు కొంచెం తక్కువే. ఎప్పుడో ఎదురులేని మనిషి సినిమాలో అలాంటి జోనర్ ను ముట్టిన నాగ్ ఇప్పుడు ఆఫీసర్ లో కూడా అలాంటి ఒక తండ్రి కోణాన్ని చూపించబోతున్నాడు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లరే ఆఫీసర్ సినిమా.

ఈ సినిమా తాలూకు వీడియో సాంగ్ ఒకటి ఈమధ్యనే విడుదల కాగా, ఇందులో తండ్రి-కూతురు సెంటిమెంట్ ప్రధాన ఆకర్షణ గా నిలవనుంది అని తెలియకనే తెలుస్తోంది. 'నవ్వే నువ్వు' అని సాగే ఈ పాటను నవ్వడం మానేసిన నాగార్జునకు మళ్ళీ నవ్వమని చెప్తూ కూతురు పాడుతున్నట్టుగా ఉంది. వీడియో అంతా నాగార్జునకు తన కూతురికి మధ్య ప్రేమానుబంధానికి అద్దం పడుతున్నట్టు ఉంది. ఇప్పటిదాకా యాక్షన్ థ్రిల్లర్ గా మాత్రమే మనకు తెలిసిన సినిమాలో ఇలాంటి మెలోడియోస్ సాంగ్ ఉండడంతో, ఈ పాట పైన ప్రేక్షకులకు ఆసక్తి పెరిగింది.

రవి శంకర్ ఈ పాటకు స్వరాలు అందించగా, సిరా శ్రీ లిరిక్స్ ను రచించారు. మే 25 నే విడుదల అవాల్సిన ఆఫీసర్ సినిమా జూన్ 1వ తారీఖున మన ముందుకు రాబోతోంది. మైరా సరీన్ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఒకరకంగా అంచనాలు తక్కువగానే ఉన్నా, ఆర్జీవీ-నాగ్ చాలా కాలం తరువాత సినిమా తీస్తుండడం వల్ల కొంత హైప్ ను కూడగట్టుకుంది.