Begin typing your search above and press return to search.

సూపర్ హిట్ హీరో బాలీవుడ్ ఎంట్రీ కి రెడీ !

By:  Tupaki Desk   |   23 Aug 2019 4:25 PM GMT
సూపర్ హిట్ హీరో బాలీవుడ్ ఎంట్రీ కి రెడీ !
X
ఈ ఏడాది చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించిన సినిమా 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'. అప్పటి వరకూ తెలుగు ఆడియన్స్ కు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే తెలిసిన నవీన్ పొలిశెట్టి ఈ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా ఇచ్చిన గుర్తింపు సక్సెస్ తో ఇప్పుడు తెలుగు మూడు సినిమాలు కమిట్ అయ్యాడు. స్వప్న సినిమాస్ బ్యానర్ లో నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు.

ఎవరైనా యాక్టర్స్ ఇతర భాషలో సినిమా చేస్తే 'ఇంట గెలిచి రచ్చ గెలవాలి' అనే సమేత ఎక్కువగా చెప్తుంటారు. ఇపుడు నవీన్ విషయంలో అదే జరుగుతోంది. ముంబై వెళ్లిన కొత్తలో బాలీవుడ్ లో యాక్టర్ గా చాలా ట్రై చేసిన నవీన్ ఆ తర్వాత వెబ్ సిరీస్ లతో బాగా పాపులర్ అయ్యాడు. ఆ పాపులారిటీతోనే 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' ఛాన్స్ అందుకున్నాడు. ఎట్టకేలకు తెలుగులో హీరోగా హిట్టు కొట్టేసాడు. అయితే ఈ సినిమా చేసే టైంలొనే బాలీవుడ్ ఓ సినిమా ఛాన్స్ వచ్చింది.

'చిచోరే' సినిమాలో ఆసీడ్ అనే క్యారెక్టర్ చేసాడు. ఇప్పుడీ సినిమా రిలీజ్ కి రెడీ అయింది. సెప్టెంబర్ 6 న గ్రాండ్ రిలీజవుతుంది. దంగల్ ఫేమ్ నితీష్ తివారి డైరెక్షన్ లో యూత్ ఫుల్ ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాతో ఎట్టకేలకు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు నవీన్. మరి ఇంట గెలిచిన ఈ యంగ్ హీరో ఇప్పుడు రచ్చ కూడా గెలిచి బాలీవుడ్ లో మరిన్ని ఆఫర్స్ అందుకుంటాడేమో చూడాలి.