Begin typing your search above and press return to search.

జాక్ పాట్ కొడుతున్న ఆత్రేయ హీరో

By:  Tupaki Desk   |   18 July 2019 5:37 AM GMT
జాక్ పాట్ కొడుతున్న ఆత్రేయ హీరో
X
సినిమా పరిశ్రమలో ఏ హీరో అయినా బ్యాక్ గ్రౌండ్ ఉన్నా లేకపోయినా సక్సెస్ ఎంత కీలకమో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ నిరూపిస్తోంది. కేవలం సోషల్ మీడియా ఫాలోయర్స్ కు తప్ప ఎవరికి అంతగా పరిచయం లేని నవీన్ పోలిశెట్టి ఒక్క విజయంతోనే మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లోకి చేరిపోతున్నాడు. విడుదలై నెల రోజులు అయినప్పటికీ ఇంకా చాలా చోట్ల స్టడీ రన్ కంటిన్యూ చేస్తున్న ఈ ఏజెంట్ ఆత్రేయకు ప్రేక్షకుల మెప్పులతో పాటు వసూళ్లు కూడా బాగా దక్కాయి.

దెబ్బకు నవీన్ పోలిశెట్టి డిమాండ్ కూడా బంగారం ధరలా పెరుగుతూ పోతోంది. క్రేజీ బ్యానర్లు ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి గతంలో పిట్టగోడ తీసిన అనుదీప్ దర్శకత్వంలో సినిమా షూటింగ్ మొదలుపెట్టేసుకున్నాడు. దీని తర్వాత వైజయంతి సంస్థకు ఓ కమిట్ మెంట్ ఇచ్చాడు. దీనికి దర్శకుడు ఇంకా ఫిక్స్ కాలేదు. డెబ్యూ డైరెక్టర్ తో ఉండొచ్చనే టాక్ ఉంది. ఇవి కాకుండా మరో రెండు కథా చర్చల దశలో ఉన్నాయి.

ఇతను ఒప్పుకోవాలే కానీ కనీసం ఆరేడు సినిమాలు లైన్ లో ఉన్నాయట. తొందపడి నిర్ణయాలు తీసుకుని ఆత్రేయ ఇచ్చిన మార్కెట్ ని తగ్గించుకోకుండా నవీన్ జాగ్రత్త పడుతున్నాడని సన్నిహితుల మాట. మొత్తానికి తంతే బూరెల బుట్టలో పడ్డట్టు ఒక్క హిట్టు కొడితే దశ తిరిగి కెరీర్ గ్రాఫ్ ఎక్కడికో పరుగులు తీస్తోంది. కాకపోతే దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత బరువు నవీన్ పోలిశెట్టి మీదే ఉంది. విజయం పక్కనుంటేనే పలకరించే పరిశ్రమలో అది చేజారినివ్వకుండా చూసుకోవాలి