Begin typing your search above and press return to search.

నవీన్ ను ‘చందమామ’గట్టెక్కిస్తుందా?

By:  Tupaki Desk   |   24 May 2016 7:30 PM GMT
నవీన్ ను ‘చందమామ’గట్టెక్కిస్తుందా?
X
అందాల రాక్షసి సినిమాతో లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న నవీన్ చంద్ర... ఆ చిత్రం తరువాత మరో హిట్ అందుకోలేకపోయాడు. ఈ చిత్రం తరువాత దాదాపు తెలుగు-తమిళ భాషల్లో కలిపి ఓ అరడజను చిత్రాల్లోకి పైగా నటించాడు. అయినా అవేవీ అతనికి పేరు తీసుకురాలేదు. ఎంతో ఆశతో నటించిన హారర్ అండ్ థ్రిల్లర్ మూవీ ‘త్రిపుర’ కూడా నిరాశే పరిచింది. కలర్ స్వాతితో కలిసి నటించిన ఈ మూవీ... నవీన్ చంద్ర కెరీర్ కు ఏ మాత్రం ఉపయోగపడలేదు. అలాగే దర్శక ధీరుడు రాజమౌళి క్యాంపు నుంచి వచ్చిన జగదీష్ తలశిలతో కలిసి ‘లచ్చిందేవికీ ఓ లెక్కుంది’ చిత్రం చేశాడు. ఇది కూడా నిరాశే మిగిల్చింది. ఇందులో రెండోసారి తనతో ‘అందాల రాక్షసి’ మూవీలో నటించిన లావణ్య త్రిపాఠితో కలిసి నటించాడు... కీరవాణి సంగీతం అందించాడు. అయితే కథ-కథనం సరిగా లేకపోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. ఇలాంటి పరాజయాల నుంచి నవీన్ చంద్ర కొంత వరకైనా మేలుకున్నాడేమో.. ఇసారి ఓ కూల్ రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీతో మన ముందుకు రాబోతున్నాడు.

‘చందమామ రావే’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రానికి ‘అది రాదు... వీడు మారడు’ అనేది క్యాప్షన్. ఇటీవలే ఈ చిత్రం టైటిల్ లోగోను కూడా లాంఛ్ చేశారు. ఇందులో నవీన్ చంద్ర రగ్ డ్ లుక్ లో కనిపించడాన్ని బట్టి చూస్తోంటే... అందాల రాక్షసిలో ఎలాంటి లుక్ తో యూత్ ని ఆకట్టుకున్నాడో.. మళ్లీ అదే లుక్ ను ఇందులో కూడా ట్రై చేసినట్టు కనిపిస్తోంది. తొలిసారిగా ఈ చిత్రానికి ధర్మ-రక్ష అనే ఇద్దరు ట్విన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇలా ఇద్దరు అన్నదమ్ములు(కవలలు) దర్శకత్వం వహించడం ఇదే మొదటి సారి అంటున్నారు. ఇందులో మూడు వేరియేషన్స్ వున్న ప్రేమకథలను నడిపించడం.. ఈ తరం యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందట.

నవీన్ చంద్ర.. తన రగ్ డ్ లుక్ తో ఈ మూడు వేరియేషన్స్ లోనూ బాగా నటించాడని చెబుతోంది చిత్ర యూనిట్. ఇందులో ప్రియల్ గోర్ అనే నూతన నటి నటిస్తోంది. అన్నట్టు ఈ మూవీలోని కొన్ని లవ్ సీన్లను.. నాచురల్ గా వుండాలని హిమాలయా పర్వతాల్లో మైన్ డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఎంతో కష్టపడి షూట్ చేశారట. అవి చిత్రానికే హైలైట్ అంట. చూడాలి మరి.. నవీన్ చంద్ర లుక్.. ఇలాంటి నాచురల్ సీన్లు ‘చందమామ’ను ఏమాత్రం గట్టెక్కిస్తాయో?!