సందీప్ కండోమ్ డైలాగ్.. నవదీప్ రాకింగ్ పంచ్

Thu Dec 06 2018 11:58:52 GMT+0530 (IST)

రానా దగ్గుబాటి నిర్వహించే నెం. 1 యారీ షో చాలా పాపులర్.  తన షోకు వచ్చే సెలబ్రిటీలను.. అతిథులను ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు వేస్తూ నవ్వుతూ నవ్విస్తూ రానా చాలా అల్లరి చేస్తాడు. ఇక రానాకు తోడుగా సందీప్ కిషన్ .. నవదీప్ లాంటి అల్లరి బాబులు.. మిల్కీ బ్యూటీ తమన్నా లాంటి అందమైన పాప ఉంటే అల్లరి ఏ రేంజ్ లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు.తమన్నా.. సందీప్ కిషన్.. నవదీప్ లు నటించిన 'నెక్స్ట్ ఏంటి' డిసెంబర్ 7 న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ముగ్గురూ నెం. 1 యారీ షో కు హాజరయ్యారు. ఈమధ్యే రిలీజ్ చేసిన ఈ ఎపిసోడ్ ప్రోమోలో ఫుల్ హంగామా చేశారు.  కూలెస్ట్ ఎవరు అని తమన్నా ను రానా అడిగితే 'యూ' అని చెప్పింది. స్మార్టెస్ట్ ఎవరు అని అడిగితె మళ్ళీ 'యూ' అని చెప్పింది. దీంతో నవదీప్.. "సందీప్.. సరే పద .. మనం బయలుదేరదాం!" అని లేచాడు.   ఇంకో బిట్ లో రానా సందీప్ ను "నవదీప్ అండర్ వేర్ బ్రాండ్ ఏంటి?" అని అడిగాడు. దెబ్బకు సందీప్ తెల్లమొహం పెట్టాడు.

ఇంకో బైట్ లో సందీప్ "కండోమ్ ఎలా ఉంటుందో చూద్దామని కొనుక్కున్నాం!" అన్నాడు.. ఈ డైలాగ్ దెబ్బకు అందరి ఫ్యూజులు ఎగిరిపోయి నవ్వుల్లో మునిగిపోయారు. నవదీప్ మాత్రం అసలు కంట్రోల్ లేకుండా నవ్వుతూనే "ఏమో ఎలా ఉందో.. ముగ్గురు అబ్బాయిలు కూర్చుని ఎలా వాడతారో చూద్దాం అనుకున్నారా?" అంతో రాకింగ్ పంచ్ విసిరాడు. ఈ ఎపిసోడ్ మాత్రం మామూలుగా లేదు. మీరూ ఈ ప్రోమో పై ఒక లుక్కేయండి.