Begin typing your search above and press return to search.

మరుగున పడ్డ సినిమాను బయటికి తీశారు

By:  Tupaki Desk   |   21 Jan 2017 3:15 PM GMT
మరుగున పడ్డ సినిమాను బయటికి తీశారు
X
నవదీప్ కెరీర్ ఆరంభంలో హీరోనే. ఆ తర్వాతా హీరోనే. ఇప్పుడు మాత్రం క్యారెక్టర్ రోల్స్ కు పడిపోయాడు. అతను హీరోగా కంటిన్యూ అవుతున్న రోజుల్లో ‘నటుడు’ అనే సినిమా ఒకటి మొదలుపెట్టిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా పోస్టర్లు అప్పట్లో ఆసక్తి రేకెత్తించాయి. టైటిల్ కూడా అట్రాక్టివ్ గా ఉండటంతో జనాల్లో ఈ సినిమా గురించి కొంత చర్చ నడిచింది. కానీ ఏమైందో ఏమో ఈ సినిమా ఉన్నట్లుండి వార్తల్లో లేకుండా పోయింది. ఇప్పుడు ‘నటుడు’ గురించి అంతా మరిచిపోయిన సమయంలో ఈ సినిమా మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఉన్నట్లుండి ఈ సినిమాను రిలీజ్ కు రెడీ చేసేస్తున్నారు.

‘నటుడు’ సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేయబోతున్నారట. నవదీప్ తో పాటు దర్శక నిర్మాతలు ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు. ఈ సినిమా కొత్త పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. నవదీప్ ఇందులో డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశాడు. ఇదొక రొమాంటిక్ థ్రిల్లరట. ఇలాంటి సినిమా చేయడానికి గట్స్ ఉండాలని.. ఈ పాత్ర.. ఈ సినిమా తన కెరీర్లో చాలా ప్రత్యేకమని నవదీప్ వ్యాఖ్యానించాడు. ‘ఎ లైఫ్ టైమ్ ఆఫ్ ఛేంజ్ కెన్ హ్యాపెన్ ఇన్ ల సింగిల్ మూమెంట్’ అంటూ ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటో తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. బెంగళూరు అమ్మాయి కావ్య శెట్టి నవదీప్ సరసన కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని ఎన్.ఎస్.ఆర్. ప్రసాద్ రూపొందించాడు. రమేష్ బాబు కొప్పుల నిర్మాత.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/