నానిలోని ‘కృష్ణ’ వచ్చేసాడు

Sun Jan 14 2018 12:29:36 GMT+0530 (IST)

న్యాచురల్ స్టార్ నాని సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే అభిప్రాయానికి ప్రేక్షకులు ఎప్పుడో వచ్చేసారు. అందుకే యావరేజ్ కంటెంట్ ఉన్న సినిమాలతో సైతం ఇరవై కోట్లకు పైగా రాబడుతున్న నాని హిట్ టాక్ వస్తే మాత్రం స్టార్ హీరోలకు ధీటుగా బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ నేను లోకల్ - నిన్ను కోరి - ఎంసి ఎ తో హ్యాపీగా క్లోజ్ చేసిన నాని ఈ సంవత్సరం తన ఇన్నింగ్స్ కృష్ణార్జున యుద్ధంతో మొదలు పెట్టబోతున్నాడు దీని ప్రమోషన్ లో భాగంగా భోగి పండగను పురస్కరించుకుని ఇందులో కృష్ణ లుక్ ని విడుదల చేసారు. కృష్ణ - అర్జున్ గా నాని ఇందులో డ్యూయల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటి పాత్ర కృష్ణను రివీల్ చేసిన యూనిట్ గెటప్ లోనే పాత్ర స్వభావాన్ని చెప్పే ప్రయత్నం చేసారు.ఊర మాస్ లుక్ తో గళ్ళ లుంగీ - నల్ల బనియన్ - బొత్తాలు తీసిన యెర్ర చొక్కాతో నాని చాలా కొత్తగా ఉన్నాడు. ఈ మధ్య కాలంలో అన్ని సాఫ్ట్ రోల్స్ కాలేజీ వెళ్ళే యూత్ తరహా పాత్రలే చేస్తున్న నాని స్టైల్ మార్చి నేల క్లాసుకు వచ్చేసాడు. బ్యాక్ గ్రౌండ్ లో గుడి గోపురాన్ని చూపిస్తూ తెల్లని పరదా వెనుక నుంచి కవర్ చేస్తున్నట్టుగా డిజైన్ చేసిన ఈ పోస్టర్ క్యూరియాసిటీ పెంచేలాగే ఉంది. కొద్దిగా ఈ ఛాయలు ఉన్న గెటప్ ‘జెండాపై కపిరాజు’ లో చూసినట్టు అనిపించినా ఇది భిన్నంగానే ఉంది. అందులో కూడా నాని చేసింది డ్యూయల్ రోలే. శర్వానంద్ తో చేసిన ఎక్స్ ప్రెస్ రాజా సూపర్ సక్సెస్ తర్వాత బాగా గ్యాప్ తీసుకుని దర్శకుడు మేర్లపాక గాంధీ చేస్తున్న సినిమా ఇది. ధృవ తర్వాత హిప్ హాప్ తమిజా మ్యూజిక్ అందిస్తున్న స్ట్రెయిట్ తెలుగు సినిమా కూడా ఇదే కావడం విశేషం. రేపు అర్జున్ ఫస్ట్ లుక్ విడుదల చేసి ఆ తర్వాత ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారు.