Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ తో పాటు మరో పర్ఫెక్షనిస్ట్

By:  Tupaki Desk   |   30 Aug 2015 3:57 AM GMT
త్రివిక్రమ్ తో పాటు మరో పర్ఫెక్షనిస్ట్
X
స్క్రిప్ట్ విషయంలో త్రివిక్రమ్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటాడో టాలీవుడ్ లో ఎవరిని అడిగినా చెబ్తారు. మొత్తం స్క్రిప్ట్ ని చేతిలో పట్టుకునే సెట్స్ పైకి వెళ్తాడు. అప్పటివరకూ ఎంత లేటైనా సరే పట్టించుకోని తత్వం ఈ మాటల మాంత్రికుడిది. బెటర్ మెంట్స్ ఇవ్వడం అనేది రేర్ అంటుంటారు ఇండస్ట్రీలో. అలాంటి త్రివిక్రమ్ కి ఇప్పుడు ఇంకో మొండిఘటం తోడవుతున్నాడు.

నట్టి అని పిలుచుకునే సినిమాటోగ్రాఫర్ నటరాజన్ తమిళ్, హిందీ మూవీలకో చేశాడు ఇప్పటివరకూ. త్వరలో రాబోతోన్న విజయ్ పులికి కూడా సినిమాటోగ్రఫీ ఈయనదే. తన నెక్ట్స్ మూవీ కోసం నట్టిని లైన్ లో పెట్టాడట త్రివిక్రమ్. అంటే సమంత లీడ్ రోల్ లో త్రివిక్రం కాంబినేషన్ లో రానున్న మూవీకి అన్నమాట.

ఇండస్ట్రీలో 16ఏళ్లకుపైగా అనుభవం ఉంది నట్టికి. హాలిడే - రాన్ ఝానా - తుపాకి - లవ్ ఆజ్ కల్ - జబ్ వియ్ మెట్ వంటి సెన్సేషనల్ హిట్స్ ఉన్నాయి ఇతగాడి కెరీర్ లో. ఈ అన్ని సినిమాలకూ... కెమేరా పనితనం చాలా ప్లస్ అయింది. ఇప్పుడీ నటరాజన్ త్రివిక్రమ్ కి తోడవుతున్నాడు. ఇద్దరూ కలిసి... అద్భుతాలని చూపించేందుకు సిద్ధమవుతున్నారని ఎక్స్ పెక్ట్ చేయచ్చు.