Begin typing your search above and press return to search.

ముద్దులే కాదు.. స్టెప్పులు కూడా వేసింది

By:  Tupaki Desk   |   19 Oct 2016 5:40 AM GMT
ముద్దులే కాదు.. స్టెప్పులు కూడా వేసింది
X
రణవీర్ సింగ్.. వాణి కపూర్ జంటగా నటించిన బేఫికర్ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ నుంచి ఇప్పటివరకూ ఒకటే యాంగిల్ లో ప్రచారం సాగింది. హీరో హీరోయిన్స్ ఇద్దరి మధ్య ముద్దుల గురించి తప్ప వేరే డీటైల్ ఏదీ చెప్పకుండా పబ్లిసిటీ చేశారు. ఎన్ని పోస్టర్స్ ఇచ్చినా.. అన్నిటిలోనూ రణవీర్-వాణి లు ముద్దులు తప్పితే వేరే ఏం కనిపించలేదు. రీసెంట్ గా లబోం కా కరోబార్ సాంగ్ ను రిలీజ్ చేసినా.. ఆ పాట మొత్తం కూడా ముద్దులతోనే నిండిపోయి ఉంటుంది.

ప్రతీ ప్రేమకథకు ప్రారంభం ముద్దే అంటూ చేసే ప్రచారం బాగానే ఆకట్టుకుంది కానీ.. కేవలం ముద్దుల కోసమే వాణి కపూర్ ని.. బేఫికర్ కోసం దర్శక నిర్మాత ఆదిత్య చోప్రా తెచ్చుకున్నాడనే రేంజ్ లో ప్రచారం సాగుతోంది. కానీ ఆ ఆలోచన తప్పని తాజాగా విడుదల చేసిన 'నషే సే చఢ్ గయీ' సాంగ్ తో చెప్పకనే చెప్పేశారు. పాట మొత్తంలో తన ట్యాలెంట్ ని ఇరగదీసేసి చూపించింది వాణి కపూర్. బ్యూటీని ఎగ్జిబిట్ చేయడంలో కూడా కొత్త రూట్ ని ప్రదర్శించినా.. అమ్మడి డ్యాన్సింగ్ ట్యాలెంట్.. ఎక్స్ ప్రెషన్ ఎలిమెంట్స్ కొత్తగా అనిపిస్తాయి.

లిప్ లాక్ జోలికి పోకుండానే పాట అయిపోతుందా ఏంటి అనుకుంటారేమో! ఆ ఫీలింగ్ లేకుండా ఉండడం కోసం కిస్ లవర్స్ కి ప్రత్యేకంగా చివర్లో ఓ స్ట్రాంగ్ మూతి ముద్దును చిన్నపాటి ఈరోటిక్ సీన్ ని యాడ్ చేశారు. ఈ సాంగ్ ప్రోమోలో అయితే రణవీర్ సింగ్ ని కూడా వాణి కపూర్ డామినేట్ చేసేసిందనడంలో సందేహం అక్కర్లేదు.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/