Begin typing your search above and press return to search.

డోనరుడు వచ్చేస్తున్నాడహో..

By:  Tupaki Desk   |   22 Oct 2016 7:30 AM GMT
డోనరుడు వచ్చేస్తున్నాడహో..
X
దసరా సినిమాల సందడి తర్వాత ఒక వారం గ్యాప్ వచ్చింది. ఈ శుక్రవారం ‘ఇజం’ భారీ అంచనాల మధ్య విడుదలైంది. దాంతో పాటు ఇంకో మూణ్నాలుగు సినిమాలు వచ్చాయి. ఇక తర్వాతి వారం పెద్దగా తెలుగు సినిమాల సందడి ఉండకపోవచ్చు. మంచు లక్ష్మి ‘లక్ష్మీ బాంబు’ మాత్రమే రిలీజవుతోంది. కాష్మోరా.. ధర్మయోగి లాంటి డబ్బింగ్ సినిమాలు రాబోతున్నాయి. ఆ తర్వాత నవంబరు 11కు ‘ఇంట్లో దయ్యం నాకే భయం’తో పాటు ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మధ్యలో ఖాళీ ఉన్న వారాంతానికి ఒక ఆసక్తికర సినిమా ఫిక్స్ అయింది. ఆ చిత్రమే.. నరుడా డోనరుడా.

సుమంత్ హీరోగా తెరకెక్కిన ‘నరుడా డోనరుడా’ మీద అంచనాలు బాగానే ఉన్నాయి. బాలీవుడ్ మూవీ ‘విక్కీ డోనర్’కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం గురించి మొదట్లో పెద్దగా చర్చ లేదు. కానీ ఫస్ట్ లుక్ పోస్టర్లు.. ట్రైలర్ రిలీజయ్యాక మాత్రం దీనిపై జనాల్లో ఆసక్తి పెరిగింది. ఆల్రెడీ సెన్సార్ కూడా పూర్తి చేసుకుని ‘యు/ఎ’ సర్టిఫికెట్ తెచ్చుకున్న ఈ సినిమా ఫస్ట్ కాపీతో విడుదలకు రెడీగా ఉంది. మంచి టైమింగ్ చూసే సినిమాను రిలీజ్ చేస్తున్నాడు హీరో కమ్ ప్రొడ్యూసర్ సుమంత్. కొత్త దర్శకుడు మల్లిక్ రామ్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో సుమంత్ సరసన పల్లవి సుభాష్ కథానాయికగా నటిస్తోంది. తనికెళ్ల భరణి కీలక పాత్ర పోషించాడు. నవంబరు 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/