Begin typing your search above and press return to search.

మళ్లీ రాజేయడం మొదలుపెట్టేసిందే

By:  Tupaki Desk   |   24 Sep 2016 3:30 PM GMT
మళ్లీ రాజేయడం మొదలుపెట్టేసిందే
X
నర్గీస్ ఫక్రీ అంటేనే హాట్ నెస్ కి నిలువెత్తు నిర్వచనం. సోషల్ నెట్వర్క్ లో.. రివీలింగ్ ఔట్ ఫిట్స్ తో తన ఫోటోలను తెగ షేర్ చేసేస్తూ ఉంటుంది. అందుకే ఈమెకు ఫాలోయర్ల సంఖ్య భారీ భారీగా ఉంటుంది. ఇన్ స్టాగ్రామ్ లో ఈమె పెట్టే ఫోటోలకు ఎంత డిమాండ్ ఉంటుందంటే.. ప్రస్తుతం నర్గీస్ ను ఫాలో అయిపోయేవారి సంఖ్య 40లక్షలను దాటిపోయింది.

అయితే.. ఈ మధ్య కాలంలో అంటే ఓ నెలన్నరగా.. వెకేషన్ కోసం గ్రీస్ వెళ్లిన ఈ భామ.. అక్కడి ప్లేస్ లతో పాటు.. తన అందాలను తెగ షేర్ చేసేసింది. వాటి డోస్ నే ఫ్యాన్స్ ఫాలోయర్స్ తట్టుకోలేకపోతుంటే.. ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ చేసేసింది. మళ్లీ ఒక్కసారిగా తన బికినీ బాడీని చూపించేస్తూ.. ఫోటో షేర్ చేసింది నర్గీస్. మరీ నారో కట్ ఉన్న బికినీ వేసుకుని.. ముందు నుంచి ఓ సారి.. వెనక్కి తిరిగి ఓసారి ఫోటోలకు పోజులిచ్చి.. వాటిని నెట్లో పెట్టేసింది ఈ వయ్యారి.

నర్గీస్ ఫక్రీ చూపించే అందాల్లో డోస్ బాగా పెరిగిపోతుండడంతో.. ఇకముందు ఇంకెలాంటి షోకులను చూడచ్చో అనుకుంటూ.. ఈమెను ఫాలో అయిపోయే వారి సంఖ్య మరింతగా పెరిగిపోతోంది. మొత్తానికి ఆన్ లైన్ లో అగ్గిరాజేయడం అంటే ఏంటో మాత్రం నర్గీస్ ని అడగాల్సిందే.