Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ బయోపిక్ లో నరేష్

By:  Tupaki Desk   |   11 July 2018 3:21 AM GMT
ఎన్టీఆర్ బయోపిక్ లో నరేష్
X
ఎన్టీఆర్ బయోపిక్ పై రోజుకో వార్త వెలువడుతూ ఆ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. తాజాగా నటుడు నరేష్ ఈ బయోపిక్ లో నటించేందుకు సంతకం చేశారు. ఆయన ప్రఖ్యాత నిర్మాత బొగట వెంకట సుబ్బారావు పాత్రలో కనిపించనున్నారు. బీఏ సుబ్బారావుగా ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీకి చిరపరిచితుడే. ఈ సుబ్బరావే ఎన్టీఆర్ కు హీరోగా తొలి చాన్స్ ఇచ్చింది. ఆయన తీసిన ‘పల్లెటూరి పిల్ల’ చిత్రం ద్వారానే ఎన్టీఆర్ తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమయ్యారు. ఆ తర్వాత కాలంలో ఎన్టీఆర్ - సుబ్బారావులు కలిసి చాలా సినిమాలు తీశారు.

సుబ్బారావు సొంతంగా ‘బీఏ’ ప్రొడక్షన్ ను స్థాపించి ‘చెంచులక్ష్మి’ - భీష్మ సినిమాలను తీశారు. ఎన్టీఆర్ కు మంచి మిత్రుడిగా కొనసాగారు. ఈ నేపథ్యంలో సుబ్బారావు పాత్రలో నరేష్ ఏ మేరకు మెప్పిస్తాడన్నది ఆసక్తిగా మారింది. ఈ మధ్యకాలంలో నరేష్ చాలా మంచి పాత్రలు చేసి పేరు సంపాదించారు. మహానటి - సమ్మోహనం - రంగస్థలంలో నరేష్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ రామోజీ ఫిలింసిటీలో కొనసాగుతోంది. ఇటీవలే నరేష్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. దర్శకుడు క్రిష్ ఈ బయోపిక్ విషయంలో చాలా శ్రద్ధ వహిస్తున్నారు. సినిమాలో కీలకమైన పాత్రకు మెరుగైన నటులను తీసుకుంటూ ఆసక్తి రేపుతున్నారు. ముందు ముందు ఈ సినిమా గురించి ఇంకా ఏఏ విషయాలు వెల్లడవుతాయో చూడాలి మరి..