Begin typing your search above and press return to search.

నరేంద్ర మోడి బాహుబలి చూస్తారటగా...

By:  Tupaki Desk   |   25 Aug 2016 11:30 AM GMT
నరేంద్ర మోడి బాహుబలి చూస్తారటగా...
X
భారత దేశ ప్రధాని నరేంద్ర మోడి నిజంగా ''బాహుబలి'' సినిమా చూస్తారో లేదో తెలియదు కాని.. ప్రస్తుతం ఈ న్యూస్ మాత్రం సోషల్ నెట్వర్కుల్లో బీభత్సంగా చెక్కెర్లు కొడుతోంది. ఎందుకంటే ''బ్రిక్స్'' సదస్సులో భారతదేశం ప్రదర్శించే నాలుగు సినిమాల్లో ఒకటి మన టాలీవుడ్ వారు రూపొందించిన బాహుబలి కాబట్టి.. ఆయన కూడా చూస్తారనే అనుకుంటున్నారు మరి.

భారత్ తో పాటు బ్రెజిల్ - రష్యా - చైనా - సౌత్ ఆఫ్రికాలు భాగంగా ఉన్న బ్రిక్స్ సమిట్ ఈ ఏడాది సెప్టెంబర్ 2 నుంచి 6 వరకు ఢిల్లీ జరగనుంది. ఈ సమిట్ లో ప్రతీ దేశం నుంచి నాలుగు సినిమాలను ప్రదర్శిస్తారు. ఈ ఏడాది మన దేశం ప్రదర్శించే సినిమాల్లో.. బాజీరావ్ మస్తానీ (హిందీ) - సినిమావాలా(బెంగాళీ) - తిథి (కన్నడ) లతో పాటు.. బాహుబలి (తెలుగు) కూడా ఉంది. సబ్ టైటిల్స్ తో ఒరిజినల్ లాంగ్వేజ్ వర్షన్లను ప్రదర్శిస్తారట. అయితే ఈ సినిమాలను ఎక్కువగా సదరు దేశాల ప్రతినిథులు - బ్యూరోక్రాట్లు - కాన్సుల్ ఆఫీస్ వారు చూస్తుంటారు. మరి దేశ ప్రధానులు ఎంతవరకు చూస్తారు అనేదే చెప్పలేం.

సర్లేండి.. భారతదేశం తరుపున అఫీషియల్ గా ఒక తెలుగు సినిమా కొన్న అగ్రరాజ్యాలకు ప్రదర్శితం కాబోతుందంటే.. అదే మనకు గర్వకారణం.