Begin typing your search above and press return to search.

బుడ్డారెడ్డి పల్లి బ్రేకింగ్ న్యూస్!!

By:  Tupaki Desk   |   9 Feb 2016 10:30 PM GMT
బుడ్డారెడ్డి పల్లి బ్రేకింగ్ న్యూస్!!
X
1940లో ఒక గ్రామం.. కమలతో నా ప్రయాణం.. లజ్జ.. వంటి సినిమాల డైరెక్టర్ నరసింహ నంది కొత్త సినిమాకు శ్రీకారం చుట్టాడు. మంచి కాన్సెప్ట్ ని.. చక్కగా డీల్ చేస్తాడనే గుర్తింపు దక్కించుకున్న ఈ దర్శకుడి సినిమా అనగానే ఫిలిం నగర్ లో ఆసక్తి నెలకొంది. ఈసారి మరో విభిన్నమైన కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడట. ఆ సినిమా టైటిల్‌ ఏంటంటే.. ''బుడ్డారెడ్డి పల్లి బ్రేకింగ్ న్యూస్''

వినేందుకు విచిత్రంగానే ఉన్నా.. ఈ టైటిల్ నే రిజిస్టర్ చేయంచాడు దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయిందని చెప్పిన నరసింహనంది.. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులకు సిద్ధమవతున్నానని అన్నాడు. అంతే కాదు.. ఈ సినిమా పూర్తి స్థాయి ఎంటర్ టెయినర్ అనీ.. అసలు ఈ మూవీ కాన్సెప్ట్ ని చూసే షాక్ అవుతారని ధీమా కూడా వ్యక్తం చేశాడు. ఓ గేదె చుట్టూ తిరిగేలా రాసిన స్టోరీ - స్క్రీన్ ప్లే.. ప్రేక్షకులనే కాదు అందరినీ ఆకట్టుకుంటుందని కాన్ఫిడెంట్ గా కూడా ఉన్నాడు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. మరో మూడు నెలల్లో రిలీజ్ కి రెడీ అవుతుందన్నాడు దర్శకుడు.

ఇదే సమయంలో మరో విషయం కూడా చెప్పాడీయన. జీవితంలో మరోసారి స్ట్రాంగ్ కంటెంట్ - సీరియస్ టాపిక్ లపై సినిమా తీయడట. అలా తీయడంతో.. లజ్జ సినిమాను థియేటర్లలోకి తెచ్చేందుకు రెండేళ్లకు పైగా పట్టిందన్న నరసింహ నంది.. బాలీవుడ్ నుంచి రీమేక్ ఆఫర్స్ వస్తున్నాయని చెప్పాడు.