Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్: అందరూ సీరియస్ గా ఉన్నారే!

By:  Tupaki Desk   |   15 Feb 2019 8:41 AM GMT
ఫస్ట్ లుక్: అందరూ సీరియస్ గా ఉన్నారే!
X
అరవింద్ స్వామి.. సందీప్ కిషన్.. శ్రియ శరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ చిత్రం 'నరగశూరన్'. ఈ సినిమాను 'నరకాసురుడు' టైటిల్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. 'దురువంగల్ పదినారు'(తెలుగులో '16') సినిమాను రూపొందించిన కార్తిక్ నరేన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను కాసేపటి క్రితం ఫిలిం మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమా ట్యాగ్ లైన్ "ది టేల్ ఆఫ్ ఎ ఫాలెన్ డెమాన్"(నేలకొరిగిన ఒక రాక్షసుడి కథ).

ఫస్ట్ లుక్ లో అరవింద్ స్వామి.. సందీప్ కిషన్.. శ్రియ సీరియస్ గా చూస్తున్నారు. ఈ ముగ్గురి కింద టైటిల్ ఉంది. టైటిల్ కింద భాగంలో మరో నటి ఆత్మిక మాత్రం స్మైలింగ్ ఫేస్ తో ఉంది. ఆమె కంటే కింద భాగంలో దట్టమైన అడవిదారిలో రాత్రిపూట ప్రయాణిస్తున్న ఒక బీఎండబ్ల్యూ కారు ఉంది. కారు నంబర్ TN 02 BR 450. పోస్టర్ లో ఇలా కారును చూపించారంటే కథలో ఏదో కీలకమైన మలుపుకు ఆ కారు కారణం అయ్యే అవకాశం ఉంది.

థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాన్ యోహాన్ సంగీత దర్శకుడు.. సుజిత్ సారంగ్ ఛాయాగ్రాహకుడు. ఈ సినిమాకు నిర్మాత కోనేరు సత్యనారాయణ. రమేష్ వర్మ పెన్మెత్స బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సమ్మర్ సీజన్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.