Begin typing your search above and press return to search.

శ్రియకు ఫ్యామిలీ ఫుడ్ కావాలన్నా నారా బాబే..

By:  Tupaki Desk   |   17 July 2017 12:02 PM GMT
శ్రియకు ఫ్యామిలీ ఫుడ్ కావాలన్నా నారా బాబే..
X
ఇప్పుడున్న టాలీవుడ్ యంగ్ హీరోల్లో వంట బాగా చేసేదెవ్వరు అంటే మరో మాట లేకుండా నారా రోహిత్ పేరు చెప్పేయొచ్చేమో. అతడి కుకింగ్ టాలెంట్ గురించి ఇండస్ట్రీ జనాలకూ తెలుసు.. సామాన్య ప్రేక్షకులకూ తెలుసు. అతను షూటింగ్ స్పాట్లో వంట చేస్తున్న ఫొటోలు రెండు మూడుసార్లు బయటికి వచ్చాయి. ఏదో సరదాకి కాకుండా చాలా సీరియస్ గా వంట చేసి.. మంచి రుచి తీసుకొస్తాడని అతడి వంటకాలు రుచి చూసిన వాళ్లు చెబుతారు. తాజాగా ‘శమంతకమణి’ షూటింగ్ గ్యాప్ లోనూ నారా రోహిత్ వంట చేసిన ఫొటోలు బయటికి వచ్చాయి. ఆ యూనిట్లో అందరికీ రోహిత్ రుచులు అలవాటేనట. అసలింతకీ పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన రోహిత్ వంట ఎప్పుడు నేర్చుకున్నాడు.. అతడికా అవసరం ఏమొచ్చింది..? రోహిత్ మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

‘‘నేను సినిమాల్లోకి రాకముందు కొంత కాలం పాటు చెన్నైలో ఉన్నా. అప్పుడు రూంలో నేను.. మా అన్న ఉండేవాళ్లం. సాయంత్రం పూట టైంపాస్ కోసం నేను వంట చేసేవాడిని. అలా అలవాటైంది. ఇప్పుడు కూడా ఏవైనా తినాలనిపిస్తే యూట్యూబ్‌ చూసి వండేస్తా. అదో పెద్ద స్ట్రెస్‌ బస్టర్‌ నాకు. ‘సావిత్రి’ షూటింగ్‌ లో ఏదో ఒకరోజు సరదాగా వండా. అంతమందికి కలిపి ఒకేసారి వండటం అదే తొలిసారి. అక్కడి నుంచి పరిస్థితి ఎలా తయారైందంటే.. ఇప్పుడు అందరూ ‘ప్లీజ్‌ ఒకసారి వండరా’ అని అడుగుతున్నారు. పవన్‌ మల్లెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌ స్పాట్‌ లో బిరియాని చేశాను. పక్కనే ‘శమంతకమణి’ సెట్‌ లో పాట తీస్తున్నారు. వాళ్లనూ రమ్మన్నా. అందరూ బిరియానీ టేస్ట్ చేసి బాగుందన్నారు. ‘వీరబోగ వసంతరాయులు’ షూటింగుకి వచ్చిన శ్రియ గారు నాకు ఫ్యామిలీ ఫుడ్ తినాలనుంది అన్నారు. వెంటనే సుధీర్ బాబు నా వైపు చూపించాడు. ఐతే ఔట్ డోర్ లో ఉన్నపుడు వంట చేస్తా కానీ.. సిటీలో ఉండగా దాని జోలికి వెళ్లను’’ అని రోహిత్ చెప్పాడు.