లెంగ్త్ ఎంతైతే ఏంటి-నారా రోహిత్

Wed Jan 04 2017 18:00:02 GMT+0530 (IST)

‘అప్పట్లో ఒకడుండేవాడు’ అనే టైటిల్ చూసి.. ఇది నారా రోహిత్ ను ఉద్దేశించిన టైటిల్ అని.. అతడిదే ఇందులో లీడ్ రోల్ అని.. శ్రీవిష్ణుది సహాయ పాత్ర అని అనుకున్నారంతా. కానీ సినిమా చూశాక కానీ అర్థం కాలేదు.. శ్రీవిష్ణునే ఇందులో హీరో అని.. రోహిత్ ది సపోర్టింగ్ రోల్ టైపు అని. ఎస్టాబ్లిష్డ్ హీరో అయి ఉండి.. తన నిర్మాణంలోనే సినిమాను తెరకెక్కిస్తూ శ్రీవిష్ణు పాత్రకు అంత ప్రాధాన్యమివ్వడానికి.. తన పాత్రను పరిమితం చేసుకోవడానికి రోహిత్ అంగీకరించడపై అన్ని వైపులా ప్రశంసలు కురుస్తున్నాయి ప్రస్తుతం. కథకు అతనిచ్చిన ప్రాధాన్యం గురించి అంతా చర్చించుకుంటున్నారు.

మరి నిడివి తక్కువున్న ఇలాటి పాత్రను ఎలా ఒప్పుకున్నారు అని రోహిత్ ను అడిగితే.. ‘‘నేనెప్పుడూ పాత్రల లెంగ్త్ గురించి ఆలోచించను. ఓ పాత్ర ఎలాంటి ఇంపాక్ట్ వేస్తుందన్నదే కీలకం. ఇంతియాజ్ అలీ  పాత్ర అలాంటి ప్రభావమే చూపిస్తుంది. ఇలాంటి పాత్రలు చేయడం పట్ల నేను చాలా గర్విస్తాను. లీడ్ రోల్ కాకపోయినా సరే సినిమాలో ఆ పాత్ర వల్ల కథ ఎలా మలుపు తిరిగిందన్నది కీలకం’’ అని రోహిత్ చెప్పాడు. శ్రీవిష్ణు కోసమే ఈ సినిమాను నిర్మించారా అని రోహిత్ ను అడిగితే.. ‘‘నాకు అతడితో చాన్నాళ్ల నుంచి స్నేహం ఉంది. విష్ణులో టాలెంట్ లేకపోతే నేనీ సినిమాను నిర్మించేవాడిని కాదు. కేవలం స్నేహం కోసమే నేను విష్ణుతో సినిమా తీశానని అందరూ అనుకుంటున్నారు. ఐతే టాలెంట్ లేకపోతే ఎంతటి దగ్గరివాడైనా నేను సినిమా చేయను’’ అన్నాడు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాకు ఇంత మంచి స్పందన వస్తుందని తాము ఊహించలేదని.. ఈ వీకెండ్లోనే సినిమా లాభాల బాట పట్టబోతుందని రోహిత్ తెలిపాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/