Begin typing your search above and press return to search.

రోహిత్ కమిట్మెంటుకి హ్యాట్సాఫ్

By:  Tupaki Desk   |   2 Jan 2017 7:38 AM GMT
రోహిత్ కమిట్మెంటుకి హ్యాట్సాఫ్
X
శ్రీ విష్ణు.. ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సహా కొన్ని సినిమాల్లో మంచి నటనతో ఆకట్టుకున్నా ఈ యువ నటుడి పేరు ఇంకా ప్రేక్షకుల్లో పూర్తిగా రిజిస్టర్ కాలేదు. అతను ఇంకా పూర్తి స్థాయి హీరోగా ఒక్క సినిమా కూడా చేసింది లేదు. హీరోగా ఎస్టాబ్లిష్ అయింది లేదు. అలాంటి నటుడిని ‘అప్పట్లో ఒకడుండేవాడు’ లాంటి మాంచి వెయిట్ ఉన్న కథ కోసం కథానాయకుడిగా ఎంచుకోవడం.. మార్కెట్ లెక్కలేమీ చూసుకోకుండా.. అసలేమాత్రం రాజీ పడకుండా సినిమా చేయడం చిన్న విషయం కాదు. ఇక్కడే నారా రోహిత్ ప్రత్యేకత కనిపిస్తుంది. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ అనే టైటిల్‌ తో సినిమా అనౌన్స్ చేసినపుడు.. ఈ టైటిల్ నారా రోహిత్‌ ను ఉద్దేశించే అనుకున్నారంతా. కానీ ట్రైలర్ చూస్తేనే ఆ ఒక్కడు రోహిత్ కాదేమో అన్న సందేహాలు కలిగాయి. ఇక సినిమా చూశాక ఆ అనుమానమే నిజమని తేలింది. నిర్మాతగా తొలి సినిమా తీస్తూ వేరే హీరోకు.. అది కూడా అంతగా ఇమేజ్ లేని నటుడికి అంత ప్రాధాన్యం ఇవ్వడంలో రోహిత్ ప్రత్యేకత కనిపిస్తుంది. సినిమాలో రోహిత్ పాత్ర కథ ప్రకారం వెళ్తుంది తప్ప.. రోహిత్ కోసమని దాన్ని పెంచడం.. అధిక ప్రాధాన్యం ఇవ్వడం ఎక్కడా కనిపించదు. కథకు నారా రోహిత్ ఇచ్చిన విలువ అది. ఇక్కడే అతను నటుడిగా.. నిర్మాతగా తన కమిట్మెంట్ చూపించాడు.

శ్రీవిష్ణుతో వ్యక్తిగతంగా రోహిత్ కు మంచి స్నేహం ఉంది. ఆ స్నేహంతోనే అతణ్ని హీరోగా నిలబెట్టడానికి పెద్ద సాహసమే చేశాడు రోహిత్. కమర్షియల్ లెక్కలేమీ వేసుకోకుండా.. బిజినెస్ గురించి ఆలోచించకుండా రాజీ పడకుండా సినిమాను నిర్మించి ప్రొడ్యూసర్ గా తొలి ప్రయత్నంలోనే తన ప్రత్యేకతను చాటుకున్నాడు నారా రోహిత్. అతడి కమిట్మెంట్ కు తగ్గట్లే ‘అప్పట్లో ఒకడుండేవాడు’కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో దీని గురించే చర్చ జరుగుతోంది. అతడి కమిట్మెంట్ కు తగ్గట్లే ‘అప్పట్లో ఒకడుండేవాడు’కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. హీరో శ్రీ విష్ణు కూడా అదరగొట్టేసాడు మంచి పేరు తెచ్చుకున్నాడు . ప్రస్తుతం ఇండస్ట్రీలో శ్రీ విష్ణు గురించే చర్చ జరుగుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/