Begin typing your search above and press return to search.

నారా హీరోతో మెగా డాటర్!!

By:  Tupaki Desk   |   27 May 2017 5:39 AM GMT
నారా హీరోతో మెగా డాటర్!!
X
ఏ మూవీకి అయినా హీరో-హీరోయిన్ కాంబినేషన్స్ ముఖ్యం. ప్రధాన పాత్రల మధ్య పండే కెమిస్ట్రీ.. మూవీని నిలబెడుతుంది. ఇక ప్రేమ కథా చిత్రాలకు అయితే.. ఈ కాంబినేషన్ అత్యంత ప్రధానమైన విషయం. హీరో-హీరోయిన్స్ కాంబో రిపీట్ చేసి కొందరు దర్శకులు సక్సెస్ కొడితే.. మరికొందరు మాత్రం ఎప్పటికప్పుడు ఫ్రెష్ నెస్ అందించేందుకు ప్రయత్నిస్తుంటారు.

ఇప్పుడు దర్శకుడు పవన్ సాదినేని అలాంటి ఓ అసాధారణమైన కాంబో సెట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. నారా రోహిత్ హీరోగా ఓ రొమాంటిక్ మూవీ తీయనున్నాడు ఈ దర్శకుడు. ఇప్పటికే స్టోరీ డిస్కషన్స్ పూర్తవగా.. ఈ చిత్రంలో హీరోయిన్ గా మెగా డాటర్ కొణిదెల నీహారికను తీసుకోవాలన్న తన ఆలోచనను చెప్పడంతో.. హీరో ఆశ్చర్యపోయాడట. అయితే.. ఈ కాంబోపై ఎంతో నమ్మకంగా ఉన్న డైరెక్టర్.. ఇప్పటికే హీరోయిన్ నీహారికను కూడా కలిసి ఆమె పాత్రపై నెరేషన్ ఇవ్వడం.. ఆమెకు ఈ రోల్ విపరీతంగా నచ్చేయడం.. నారా రోహిత్ తో కలిసి రొమాంటిక్ మూవీలో నటించేందుకు ఒప్పుకోవడం జరిగిపోయాయనే టాక్ వినిపిస్తోంది.

నారా రోహిత్.. నీహారిక కొణిదెల.. ఈ కాంబినేషన్ వింటేనే బోలెడంత ఆసక్తి కలుగుతోంది. ఇప్పటికైతే ఈ ప్రాజెక్టుపై ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు. త్వరలో మిగిలిన క్యాస్టింగ్ కు కూడా ఫైనల్ చేసి.. ఇప్పుడు మూవీ అనౌన్స్ మెంట్ చేయనున్నారని తెలుస్తోంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/