Begin typing your search above and press return to search.

వావ్; బొద్దు పోయి ముద్దుగా మారాడే

By:  Tupaki Desk   |   6 Feb 2016 5:30 PM GMT
వావ్; బొద్దు పోయి ముద్దుగా మారాడే
X
తెలుగు ఇండస్ట్రీలో కొందరు యువహీరోలు చాలా ప్రత్యేకం. మూసకు భిన్నంగా ఉంటూ.. తాము చేసే సినిమాల్లో నూతనత్వం ఉండేలా వారు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. అలాంటోళ్లలో నారా రోహత్ ఒకడు. తన ప్రతి సినిమాలోనూ ఒక కొత్తదనాన్ని చూపిస్తూ వెళ్లటం అతగాడి ప్రత్యేకత. మిగిలిన యువ హీరోలతో పోలిస్తే భిన్నంగా వ్యవహరించే రోహిత్ లో ఒకేఒక్క మైనస్ పాయింట్ అతగాడి బొద్దుతనం. చేసే సినిమాల మీద చూపించే శ్రద్ధ బాడీ మీద బాసు కానీ పెడితే.. ఇరగదీస్తాడని అతన్ని అభిమానించే అభిమానులు ముద్దుగా విసుక్కుంటారు.

మరి.. అలాంటి మాటలు నారారోహిత్ వరకూ వెళ్లయో లేదో కానీ.. తాజాగా అతడు చేస్తున్న సినిమాకు సంబంధించి స్లిమ్ అవ్వాల్సిన అవసరం ఏర్పడింది. కిక్ బాక్సర్ గా నటిస్తున్న తమిళ రీమేక్ కోసం రోహిత్ ఏకంగా ఆరు కిలోలు తగ్గిపోయాడు. బొద్దుతనం పోయి.. స్లిమ్ గా సిక్స్ కేజీస్ లాస్ కావటమే కాదు.. సిక్స్ ప్యాక్ తో కనిపించనుండటం ఈసినిమా స్పెషల్ అట్రాక్షన్ గా చెబతున్నారు.

కిక్ బాక్సింగ్ తో పాటు.. ఈ సినిమాలో ఆకర్షించే అంశాలు చాలానే ఉన్నాయని.. హాస్యంతో పాటు.. లైట్ టచ్ లో ఉండే డ్రామా ఆకట్టుకోవటం ఖాయమని చెబుతున్నారు. గుండెల్లో గోదారి ఫేం కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే .. రోహిత్ పక్కన మెరిసిపోయిందని.. ఈ ఇద్దరి జంట అదిరిపోతుందన్నది తాజా టాక్.