Begin typing your search above and press return to search.

నారా రోహిత్ శంకర.. రిలీజ్ డేట్ ఫిక్స్

By:  Tupaki Desk   |   24 Aug 2016 8:56 AM GMT
నారా రోహిత్ శంకర.. రిలీజ్ డేట్ ఫిక్స్
X
ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఎట్టకేలకు వచ్చేస్తోంది. దాదాపు రెండేళ్లుగా విడుదల కోసం ఎదురు చూస్తున్న నారా రోహిత్ సినిమా ‘శంకర’ ఎట్టకేలకు విడుదలకు నోచుకుంటోంది. సెప్టెంబరు 16న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేనున్నట్లు నిర్మాత ప్రకటించాడు. అసలు విడుదలకే కాదనుకున్న ఈ సినిమా అనుకోకుండా ఈ మధ్యే వార్తల్లోకి వచ్చింది. ఇందులో హీరో రోహిత్.. హీరోయిన్ రెజీనాల లుక్స్ చూస్తేనే ఈ సినిమా ఇప్పటిది కాదన్న విషయం అర్థమైపోతుంది. ఈ మధ్య రిలీజ్ చేసిన పోస్టర్లు సినిమా మీద బాగానే ఆసక్తి రేకెత్తించాయి. తాతినేని సత్య రూపొందించిన ఈ సినిమాకు చంద్రమౌళి ప్రసాద్ నిర్మాత.

తమిళంలో సూపర్ హిట్టయిన ‘మౌనగురు’కు రీమేకే ఈ ‘శంకర’. తమిళంలో కరుణానిధి మనవడు అరుల్ నిధి హీరోగా నటించాడు. ఆవేశపరుడైన ఓ సాధారణ యువకుడు వ్యవస్థ మీద తిరగబడటం.. ఆ క్రమంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం.. చివరికి తన కష్టాలన్నింటినీ అధిగమించి తనను ఇబ్బంది పెట్టిన వాళ్లపై ప్రతీకారం తీర్చుకోవడం నేపథ్యంలో కథ సాగుతుంది. కథనం చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. ‘మౌనగురు’ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కు తెగ నచ్చేసి.. ఇందులోని హీరో పాత్రను హీరోయిన్ గా మార్చేసి.. సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో హిందీలో ‘అకీరా’ పేరుతో రీమేక్ చేశాడు. ఆ సినిమా సెప్టెంబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకో రెండు వారాలకే తెలుగు రీమేక్ ‘శంకర’ విడుదలవుతుంది. మరి దేని ఫలితం ఎలా ఉంటుందో చూద్దాం.