Begin typing your search above and press return to search.

నారా రోహిత్ ఏ 'శబ్దం' చేస్తాడు

By:  Tupaki Desk   |   18 March 2018 6:34 AM GMT
నారా రోహిత్ ఏ శబ్దం చేస్తాడు
X
హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరసగా సినిమాలు చేసుకుంటూ పోతున్న హీరో నారా రోహిత్ తన 18వ ప్రాజెక్ట్ ‘శబ్దం’ ఈ రోజు నుంచి మొదలుపెట్టేసాడు. విభిన్నమైన కథలతో ప్రయోగాలు చేయడానికి ఇష్టపడే రోహిత్ గత ఏడాది మాస్ మసాలాగా చేద్దామని ట్రై చేసిన బాలకృష్ణుడు బొక్క బోర్లా పడిన సంగతి తెలిసిందే. ఒకటి అరా తప్ప సోలో హీరోగా చేసిన సినిమాలన్నీ ఫలితంలో తేడా కొడుతున్నా రోహిత్ టేస్ట్ కి మాత్రం మంచి మార్కులే పడుతున్నాయి. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో వెంకటేష్ సినిమాలో తనకు కో స్టార్ గా నటిస్తున్న నారా రోహిత్ కొత్త సినిమా శబ్దం ఇవాళ అమరావతిలో షూటింగ్ మొదలుపెట్టుకుంది. క్యాప్షన్ గా హిస్ సైలెన్స్ ఈజ్ వెపన్ అని పెట్టారు.అంటే ఇతని మౌనమే ఆయుధం. హీరో పాత్రకు మాటలు లేకుండా ఏమైనా డిజైన్ చేసారేమో అన్న సంకేతం స్పష్టంగా కనిపిస్తోంది.

శబ్దం దర్శకుడు పిబి మంజునాథ్. గతంలో 'లేడీస్ అండ్ జెంటిల్ మెన్' అనే సినిమా ఒకటి తీసాడు. టెక్నాలజీ వచ్చాక యువత మీద దాని ప్రభావం ఎంత దారుణంగా ఉందో చూపిస్తూ కొత్త కుర్రాళ్ళతో చేసిన ప్రయత్నం ప్రశంశలు అందుకున్నప్పటికి సినిమా కమర్షియల్ గా విజయం సాధించలేదు. మళ్ళి ఇంత గ్యాప్ తర్వాత నారా రోహిత్ తో సెట్ చేసుకున్నాడు మంజునాథ్. నారాయణరావు అట్లూరి నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ నిరవధికంగా జరగబోతోంది. రోహిత్ పాత్ర తీరుతెన్నులు బయటికి చెప్పలేదు కాని ఇందులో మాటలు రాని మూగవాడిగా కనిపించనున్నట్టు టాక్.

సినిమాలో హీరో అంటే ఎటువంటి అవలక్షణాలు ఉండకూడదు అనే ఫార్ములా నుంచి బయటికి వచ్చిన నవతరం దర్శకులు కొత్త తరహా పాత్రలను సెట్ చేస్తున్నారు. భలే భలే మగాడివోయ్ - మహానుభావుడు - కేశవ రానున్న రంగస్థలం - సవ్యసాచి ఇలా ప్రతి సినిమాలోనూ హీరోకు ఒక లోపాన్ని హై లైట్ చేయడం ద్వారానే కొత్తదనాన్ని చూపిస్తున్నారు. మరి నారా రోహిత్ కూడా ఈ బ్యాచ్ లో జాయిన్ అవుతాడేమో చూడాలి.