Begin typing your search above and press return to search.

నారా రోహిత్.. ఫినిష్ చేసేశాడు

By:  Tupaki Desk   |   10 Oct 2015 1:30 PM GMT
నారా రోహిత్.. ఫినిష్ చేసేశాడు
X
నిన్నో మొన్నో సినిమా మొదలు పెట్టినట్లుంది. అప్పుడే షూటింగ్ అవగొట్టేశాడంట నారా రోహిత్. కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో నారా వారబ్బాయి జూన్ నెలలో ఓ సినిమా మొదలుపెట్టిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా షూటిగ్ అయిపోయిందంటూ ప్రెస్ నోట్ ఇచ్చారు ఇవాళ. ఇప్పటికే రోహిత్ స్పీడు చూసి కళ్లు కుడుతున్నాయి జనాలకు. ఇప్పుడు మరీ జెట్ స్పీడ్ లో వెళ్తున్నట్లున్నాడు కుర్రాడు. ఇంత పర్ ఫెక్ట్ ప్లానింగ్‌ తో సినిమాలు చేయడం రోహిత్ కు మాత్రమే సాధ్యమవుతోంది. అలాగని ఏదో చెత్త సినిమాలు చేస్తున్నాడేమో అనడానికీ లేదు. కంటెంట్ పరంగా చాలా స్ట్రాంగ్ గా ఉంటున్నాయి రోహిత్ సినిమాలు.

రోహిత్-కుమార్ నాగేంద్ర కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు కథ అందించింది తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కావడం విశేషం. తమిళంలో శివ కార్తికేయన్ హీరోగా ‘మాన్ కరాటె’ పేరుతో విడుదలై మంచి విజయం సాధించిందా సినిమా. రోహిత్ ఇందులో బాక్సర్ గా నటిస్తుండటం విశేషం. ఈ మూవీ కోసం అతను తన ఫిజిక్ కూడా మార్చుకున్నాడు. సిక్స్ ప్యాక్ ట్రై చేశాడని అంటున్నారు. లతా హెగ్డే అనే కొత్తమ్మాయి రోహిత్ సరసన నటిస్తున్న ఈ సినిమాను అశోక్, నాగార్జున్ నిర్మించారు. నవంబర్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకొన్ని రోజుల్లో ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. టైటిల్ కూడా ఆ రోజే అనౌన్స్ చేస్తారు.