Begin typing your search above and press return to search.

అప్పట్లోనే కాదు.. ఇప్పుడు కూడా ఒకడిలా..

By:  Tupaki Desk   |   25 July 2016 7:58 AM GMT
అప్పట్లోనే కాదు.. ఇప్పుడు కూడా ఒకడిలా..
X
నారా రోహిత్ కి.. ఈ కుర్రాడి సినిమాలకి టాలీవుడ్ ఆడియన్స్ లో స్పెషల్ క్రేజ్ ఉంది. మొదటి సినిమా నుంచి ప్రతీ మూవీని డిఫరెండ్ సబ్జెక్ట్ ని ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు. ప్రయోగాలు చేసీ చేసీ ఈ ఏడాది ఒకట్రెండు కమర్షియల్ ఫార్ములా అనిపించే సినిమాలు చేశాడు కానీ.. తన ఒరిజినల్ రూట్లోనే దూసుకుపోతున్నాడు.

అప్పట్లో ఒకడుండే వాడు అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పుడీ సినిమాలో కుర్రాడి లుక్ ని విడుదల చేశారు. ఇవాళ అంటే జూలై 25న నారా రోహిత్ బర్త్ డే సందర్భంగా.. అప్పట్లో ఒకడుండేవాడు లుక్ ని రివీల్ చేశారు. ఇందులో నూరుద్దీన్ మొహమ్మద్ ఇంతియాజ్ ఆలీగా నటిస్తున్నాడీ కుర్ర హీరో. సాంప్రదాయ ఆకుపచ్చని టోపీ పెట్టుకుని. రఫ్ లుక్ తో సీరియస్ గా కనిపిస్తున్నాడు. గెడ్డం లుక్ నారా రోహిత్ కి బాగా నప్పిందని చెప్పాలి. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో.. యాక్టర్ శ్రీ విష్ణు విలన్ పాత్ర పోషిస్తున్నాడు.

తొలిసారిగా నారా రోహిత్ నిర్మిస్తున్న సినిమా అప్పట్లో ఒకడుండేవాడు. ఈ మూవీ పోస్టర్లలో.. నారా రోహిత్ అండ్ శ్రీ విష్ణు నటిస్తున్న అని రాస్తుడడం.. ఈ కుర్రాడి గొప్పదనాన్ని చెప్పకనే చెబుతోంది. అప్పట్లోనే కాదు.. ఇప్పుడు కూడా ఇలాంటి మంచోళ్లు ఉన్నారనే విషయం.. విలన్ పేరును కూడా పోస్టర్ పై వేసినప్పుడే అర్ధమవుతోంది. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తయిపోగా.. అప్పట్లో ఒకడుండేవాడు చిత్రాన్ని సెప్టెంబర్ లో విడుదల చేసేందుకు యూనిట్ సిద్ధమవుతోంది.