వెంకీ తమ్ముడిగా బాలకృష్ణుడు

Sun Jan 21 2018 16:47:30 GMT+0530 (IST)

గురు తర్వాత బాగా గ్యాప్ తీసుకున్న విక్టరీ వెంకటేష్ ఫైనల్ గా తేజ తో తన కొత్త సినిమా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఆటా నాదే వేటా నాదే అనే టైటిల్ కూడా ఫిక్స్ అయినట్టు టాక్ బలంగా ఉంది. ఒకపక్క ఎన్టీఆర్ బయోపిక్ మరోపక్క వెంకీ సినిమాని రెండు బాలన్స్ చేయాల్సిన బాధ్యత మోస్తున్న తేజ బాలయ్య సినిమాకు గ్యాప్ తీసుకుని వెంకటేష్ మూవీపై ఫోకస్ చేయబోతున్నట్టు తెలిసింది. కథలో చాలా కీలకమైన చిన్న తమ్ముడి పాత్ర కోసం నారా రోహిత్ ని దాదాపు ఖరారు చేసినట్టు తాజా సమాచారం. ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాలేదు కాబట్టి దానికి సంబంధించిన ఎటువంటి అప్ డేట్ అఫీషియల్ గా బయటికి రావడం లేదు. సంభాషణలు  డైమండ్ రత్నబాబు అందిస్తున్నట్టు తెలిసింది. ఇటీవలే సదరు రచయిత తన ఫేస్ బుక్ ఎకౌంటు లో సురేష్ ప్రొడక్షన్స్ లో తన తొలి చెక్ అందుకున్నందుకు తేజకు థాంక్స్ చెబుతూ మెసేజ్ పోస్ట్ చేసాడు కనక అది ఈ సినిమాకే అనుకోవచ్చు.నారా రోహిత్ ముందు నుంచి మల్టీ స్టారర్ మూవీస్ కు అనుకూలంగానే ఉన్నాడు. తన పాత్ర పరిధి ఏమని కూడా చూసుకోకుండా కథ నచ్చితే చాలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. శమంతకమణి అప్పట్లో ఒకడుండేవాడు లాంటివి అలా వచ్చినవే. సోలో హీరోగా నారా రోహిత్ నటించిన బాలకృష్ణుడు మాత్రం చేదు ఫలితాన్ని ఇచ్చింది.ఇప్పుడు వెంకీ సినిమాలో తమ్ముడిగా నటించడం కెరీర్ పరంగా కూడా ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇందులో వెంకీ మధ్య వయస్కుడైన కాలేజీ లెక్చరర్ గా కనిపిస్తాడు అనేది ఇన్ సైడ్ టాక్. హీరొయిన్ ఎవరో ఇంకా బయటికి చెప్పలేదు

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు - గోపాలా గోపాలా - మసాలా లాంటి సినిమాల ద్వారా ఇతర హీరోలతో నటించేందుకు ఎలాంటి సమస్యా ఫీల్ కాని వెంకీకి నారా రోహిత్ కాంబినేషన్ కొత్తది అవుతుంది. ఆ మధ్య తిరుమల కిషోర్ దర్శకత్వంలో ఆడాళ్ళు మీకు జోహార్లు అనే ప్రాజెక్ట్ ఆగిపోయాక వెంకీ మళ్ళి ఈ సినిమాతోనే వార్తల్లోకి వచ్చాడు. సమ్మర్ లోపే షూటింగ్ ఫినిష్ చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.