శాతకర్ణి ఎలాఉందో చెప్పిన లోకేష్!

Wed Jan 11 2017 18:44:39 GMT+0530 (IST)

నందమూరి బాలకృష్ణ వందో సినిమా "గౌతమిపుత్ర శాతకర్ణి" గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అటు బాలయ్య అభిమానుల్లోనూ ఇటు సాదారణ ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలే ఉన్నాయి. సంక్రాంతి పండక్కి బాలయ్య సినిమాలదీ ఒక విడదీయరాని సంబందం ఉండటంతో పాటు ఈ ఏడాది రాబోతున్నది వందో సినిమా కూడా కావడంతో అభిమానుల సంబరాలు అంబరాలను అంటుతున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేస్తున్నారు బాలకృష్ణ అల్లుడు నారా లోకేష్.

ఈ సినిమా చాలా బాగా వచ్చిందని ఇప్పటికే ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంటుండగా తాజాగా గౌతమీపుత్ర శాతకర్ణి గురించి బాలయ్య అల్లుడు లోకేష్ - కూతురు బ్రాహ్మణి ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమా చాలా బాగుందని ఈ సినిమాలో బాలయ్య నటన అద్భుతమనై ఇప్పటికీ ఈ సినిమా ప్రీమియర్ చూసి ముగ్దులమయ్యామని స్పందించారు. అలాగే... ఈ సినిమా ద్వారా అమరావతి గొప్పదనాన్ని తెలుసుకున్నామని దీన్ని అద్భుతంగా తెరకెక్కించారని బాలయ్య పర్ఫామెన్స్ సూపర్ అని లోకేష్ పేర్కొన్నారు.

ఆ సంగతులు అలా ఉంటే... గురువారం సినిమా విడుదల సందర్భంగా బాలయ్య అభిమానులు ఇప్పటికే అన్ని థియేటర్లనూ ముస్తాబు చేసేశారు. ఇదే క్రమంలో రోడ్లపై ర్యాలీలు చేపడుతూ సంబరాలు చేసుకుంటున్నారు!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/