అన్న ఎన్టీఆర్ కు చెల్లెలు బ్రాహ్మణి సర్ ప్రైజ్ గిఫ్ట్!

Sun Oct 21 2018 17:27:38 GMT+0530 (IST)

ఎన్టీఆర్.. బ్రాహ్మణి అన్నా చెల్లెళ్లు. అయినా.. వారిద్దరికి సంబంధించిన ఒక్క వార్త కూడా ఎప్పుడు బయటకు రాలేదు. అందుకు భిన్నంగా తాజాగా బయటకు వచ్చిన సమాచారం ఇప్పుడు వార్తగా మారటమే కాదు.. అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. దసరా పండగ సందర్భంగా అన్న ఎన్టీఆర్కు చెల్లెలు బ్రాహ్మణి పంపిన కానుక ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.ఇంతకీ అన్న ఎన్టీఆర్కు చెల్లెలు బ్రాహ్మణి ఏం కానుక పంపింది? ఎందుకు పంపారు? ఆ కానుక చూసినంతనే భావోద్వేగానికి గురైన ఎన్టీఆర్ ఎందుకు కంటతడి పెట్టుకున్నారన్నది చూస్తే..

ఇటీవల ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ మూవీని బ్రాహ్మణి చూశారట. ఆ సినిమాలో అన్న నటనకు చెల్లెలు బ్రాహ్మణి ప్రశంసల వర్షం కురిపిస్తోంది. అంతేనా.. దసరా సందర్భంగా ఎన్టీఆర్కు ఆమె ఒక బహుమతి పంపారు. ఆ సర్ ప్రైజ్ గిఫ్ట్ ను చూసిన ఎన్టీఆర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇంతకీ.. ఎన్టీఆర్ను అంత సర్ ప్రైజ్ చేసిన బహుమతి ఏమంటే.. తన తండ్రి హరికృష్ణకు సంబంధించిన అరుదైన ఫోటోల్ని ఒక చక్కటి అల్బమ్ గా తయారు చేసి.. సీడీని ఎన్టీఆర్ కు పంపారు.

దీన్ని చూసిన ఎన్టీఆర్ భావోద్వేగానికి గురై.. కంటతడి పెట్టుకున్నారట. తన చెల్లెలు పంపిన అరుదైన గిఫ్ట్ కు అన్న ఎన్టీఆర్ థ్యాంక్స్ చెప్పారు. ఎప్పుడూ లేని రీతిలో ఈ అన్న చెల్లెళ్ల అనుబంధానికి గుర్తుగా బయటకు వచ్చిన ఈ అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారటమే కాదు.. అందరి నోటా నానుతోంది.