Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: నీడ లేని నెపోలియన్

By:  Tupaki Desk   |   22 May 2017 4:29 AM GMT



ఒకే మూస ధోరణిలో సినిమాలు వస్తుంటాయనే అపవాదు టాలీవుడ్ పై ఉంది. కమర్షియల్ విలువలకు ఇచ్చిన ప్రాధాన్యత.. కథకు గానీ.. వైవిధ్యానికి ఉండదని అంటూ ఉంటారు. కానీ ఇప్పుడీ ట్రెండ్ మారుతోంది. కొత్తతరం దర్శకులు వెరైటీ సినిమాలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకూ చూడని కాన్సెప్ట్ లను ప్రజలకు చూపేందుకు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు.

ఆనంద్ రవి హీరోగా రూపొందుతున్న నెపోలియన్ అనే మూవీ ఇప్పుడు ఆసక్తి కలుగుతోంది. రెండువారాల క్రితం నీడలేని వ్యక్తికి సంబంధించిన మోషన్ పోస్టర్ తో నెపోలియన్ బోలెడంత బజ్ క్రియేట్ చేశాడు. ఇప్పుడీ చిత్రానికి టీజర్ విడుదలైంది. ప్రధాన పాత్రలో నటించిన ఆనంద్ రవి.. తన నీడ పోయిందంటూ పోలీస్ స్టేషన్ లో కంప్లెయింట్ ఇస్తాడు. టాప్ యాంగిల్ నుంచి షాట్ ద్వారా.. ఆ సీన్ లో అందరి నీడలు ఉంటాయి కానీ.. హీరోకి మాత్రం షాడో కనిపించదు. నిజంగానే నీడ కనిపించకపోవడంతో నీ పేరేంటి అని అడిగితే.. నెపోలియన్ అని ఆన్సర్ ఇస్తాడు. ఉదయం నుంచి నీడ కనిపించడం లేదని చెబ్తాడు హీరో. తాను అనాథను అని కులం.. మతం లాంటివేమీ లేవని అంటాడు.

పోయినట్లు ఎలా తెలిసిందని పోలీస్ అడిగితే.. 'దేవుడు కల్లోకి వచ్చి చెప్పాడు' అన్నది ఆన్సర్. మరి ఏ దేవుడు కల్లోకి వచ్చాడంటే.. 'ప్యాంట్ షర్ట్ వేసుకుని కేజువల్ గా వచ్చాడు' అంటాడు హీరో. ఆ తర్వాత కార్లో ఉన్న హీరోను చూపించిన విధానం చూస్తే.. థ్రిల్లర్ ను చూపించబోతున్నారనే సంగతి అర్ధమవుతుంది. నీడలేని హీరో పాత్రతో నెపోలియన్ మూవీ ఆసక్తి కలిగిస్తోందనే చెప్పాలి.